- Home
- Entertainment
- పవన్ పై అలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో నటించకపోవడానికి కారణం ?
పవన్ పై అలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో నటించకపోవడానికి కారణం ?
అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ గురించి రాస్తావన రావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ ఉన్నారు. కానీ పవన్ చివరి రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో మాత్రం అలీ కనిపించలేదు.

రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య కొంత గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీలో చేరడం, జనసేనకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం పవన్ కి నచ్చలేదు. ఫలితంగా పవన్ ఆలీపై బహిరంగంగానే ఘాటుగా మాట్లాడారు. పవన్ కామెంట్స్ కి తాను కూడా హర్ట్ అయ్యానని అలీ స్పందించడం చూసాం.
ప్రస్తుతం పవన్, అలీ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే సీఎం జగన్.. అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైసిపికి నిబద్దతతో పనిచేయడం వల్ల దక్కిన ప్రతిఫలం అని అలీ చెప్పుకొచ్చారు. తాజా జగన్ అడుగు జాడల్లో నడుస్తానని అన్నారు.
ఈ సందర్భంగా అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ గురించి రాస్తావన రావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ ఉన్నారు. కానీ పవన్ చివరి రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో మాత్రం అలీ కనిపించలేదు. రాజకీయంగా ఏర్పడిన గ్యాప్ వల్లే ఇలా జరిగింది అనే రూమర్స్ ఉన్నాయి.
Janasena political affairs meeting
దీనిపై అలీ స్పందిస్తూ.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ సీరియస్ గా సాగే చిత్రాలు. ఆయా చిత్రంలో కామెడీకి అవకాశమే లేదు. నేనే కాదు ఆ చిత్రాల్లో ఏ కమెడియన్ కూడా నటించలేదు కదా అని అలీ అన్నారు. కామెడీకి ఆస్కారం ఉన్న ఏదైనా సినిమా పవన్ చేస్తే నన్ను తప్పకుండా పిలుస్తారు అనే అనుకుంటున్నా అని అన్నారు.
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ త్వరలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి హాజరవుతారంటూ వార్తలు వస్తున్నాయి. దీని గురించి అలీని ప్రశ్నించగా .. పవన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ షో గురించి నాకు తెలియదు. అవకాశం ఉంటే నేను చేస్తున్న అలీతో సరదాగా షోకి పవన్ ని ఇన్వైట్ చేస్తాను అని అలీ అన్నారు.
pawan kalyan
వైసిపి ప్రభుత్వంలో అలికి మంత్రి పదవి కానీ, రాజ్యసభ సీటు కానీ దక్కుతాయని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. కాయాన్ని చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అవకాశం దక్కింది.