- Home
- Entertainment
- ట్రెండీ వేర్ లో ‘కలర్ ఫొటో’ హీరోయిన్ అందాల విందు.. చాందినీ చౌదరి స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా..
ట్రెండీ వేర్ లో ‘కలర్ ఫొటో’ హీరోయిన్ అందాల విందు.. చాందినీ చౌదరి స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా..
టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి (Chandini Chowdary) ట్రెండీ వేర్ లో మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరీ ( Chandini Chowdary) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరవుతోంది. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని తన కేరీర్ ను షార్ట్ ఫిల్మ్స్ తోనే ప్రారంభించింది.
2012 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న చాందిని.. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.
తను నటించిన ‘కలర్ ఫొటో’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ హిట్ గా నిలవడంతో చాందినికి కూడా క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత వరుస చిత్రాలను అందుకుంటోంది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటోంది.
ఈ మేరకు చాందిని అదిరిపోయే ఫొటోషూట్లు కూడా చేస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మతిపోగొడుతోంది. అందాల విందుతో తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా నిలిచాయి.
లేటెస్ట్ పిక్స్ లో చాందిని స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో తెలుగు బ్యూటీ అందాల విందు చేసింది. ఎల్లో డ్రెస్ లో హోయలు పోతూ కుర్రాకారును ఆకర్షిస్తోంది. గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్లను తనవైపు తప్పుకుంటోంది. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
వరుస చిత్రాల్లో నటిస్తున్న చాందిని ఇటీవల యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి ‘సమ్మతమే’ చిత్రంలో నటించింది. సాన్వి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ‘గామీ’ చిత్రంలో నటిస్తోంది.