- Home
- Entertainment
- తండ్రికి కూతురిని దూరం చేసిన శ్రీజా?... నిన్ను చూసి చాలా కాలం అవుతుంది తల్లీ, కళ్యాణ్ దేవ్ సెన్సేషనల్ పోస్ట్
తండ్రికి కూతురిని దూరం చేసిన శ్రీజా?... నిన్ను చూసి చాలా కాలం అవుతుంది తల్లీ, కళ్యాణ్ దేవ్ సెన్సేషనల్ పోస్ట్
మనస్పర్థలతో విడిపోయిన కళ్యాణ్ దేవ్-శ్రీజా మధ్య కూతురు విషయంలో కోల్డ్ వార్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్ట్స్ రుజువుగా నిలుస్తున్నాయి.

Kalyan Dev-Sreeja
శ్రీజా(Sreeja)-కళ్యాణ్ దేవ్ విడిపోయారన్నది వాస్తవం. ఏడాది కాలంగా వారు వేరుగా ఉంటున్నారు. శ్రీజ తండ్రి చిరంజీవి(Chiranjeevi)తో పాటు ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్ తన పేరెంట్స్ దగ్గర ఉంటున్నారు. వీరిద్దరికీ అధికారికంగా విడాకులు కూడా అయ్యాయనేది విశ్వసనీయ సమాచారం. శ్రీజా-కళ్యాణ్ దేవ్ లలో ఎవరూ స్వయంగా ప్రకటించకపోవడంతో కొంత అయోమయం నెలకొంది.
Kalyan Dev-Sreeja
చిరంజీవి ఫ్యామిలీ అభ్యర్ధన మేరకే కళ్యాణ్ దేవ్ విడాకుల ప్రకటన మీడియాలో షేర్ చేయలేదని సమాచారం. మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాక కళ్యాణ్ దేవ్ కెరీర్ కూడా నెమ్మదించింది. ఆయన గత రెండు చిత్రాలు సూపర్ మచ్చి, కిన్నెరసాని లను మెగా హీరోలు ప్రమోట్ చేయలేదు. ఇక కొత్త సినిమా అవకాశాలు కూడా కళ్యాణ్ దేవ్ కి రావడం లేదు.
Kalyan Dev-Sreeja
మనస్పర్థలతో విడిపోయిన కళ్యాణ్ దేవ్-శ్రీజా మధ్య కూతురు విషయంలో కోల్డ్ వార్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్ట్స్ రుజువుగా నిలుస్తున్నాయి.
Kalyan Dev-Sreeja
శ్రీజాకు ఇద్దరు కుమార్తెలు కాగా... చిన్న కూతురు నవిష్క కళ్యాణ్ దేవ్ సంతానం. పాప వయసు ఐదేళ్ల లోపు ఉంటుంది. చిన్న పిల్లల బాధ్యత సాధారణంగా తల్లికే అప్పగిస్తాయి. అయితే టైం ఇంటర్వల్స్ ప్రకారం తండ్రి కూడా కలిసే అవకాశం ఉంటుంది. శ్రీజా-కళ్యాణ్ దేవ్ మధ్య కూతురు పెంపకం విషయంలో ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందనేది తెలియదు.
Kalyan Dev-Sreeja
నవిష్క తల్లి వద్దే ఉంటుంది. శ్రీజాతో విడిపోయాక కళ్యాణ్ దేవ్ కూతురిని అప్పుడప్పుడు కలుస్తున్నాడు. నవిష్కను ఎప్పుడు కలిసినా కళ్యాణ్ దేవ్ ఆమెతో దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు. డిసెంబర్ 25 నవిష్క బర్త్ డే అని తెలుస్తుంది. ఆ ఆరోజు కళ్యాణ్ దేవ్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కూతురికి బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు చాలా మిస్ అవుతున్న బాధ సదరు పోస్ట్ లో పంచుకున్నారు.
Kalyan Dev-Sreeja
తన వద్దే నవిష్క ఆనందంగా ఉంటుంది,అని అర్థం వచ్చేలా కళ్యాణ్ దేవ్ గతంలో పోస్ట్స్ పెట్టాడు. తనతో నవిష్క హ్యాపీగా ఆడుకుంటున్న ఫోటోలు షేర్ చేశాడు. ఈ పరిణామాలు గమనిస్తుంటే కూతురు ఎవరి వద్ద ఉండాలనే విషయంలో శ్రీజా-కళ్యాణ్ దేవ్ మధ్య వాదన నడుస్తుంది.
Sreeja
చట్టబద్ధంగా కానీ, ఫ్యామిలీ అగ్రిమెంట్ వలన కానీ నవిష్క మాత్రం తల్లి వద్దే ఉంటుంది. అక్టోబర్ నెలలో కళ్యాణ్ దేవ్ కూతురిని కలిశాడు. మరలా ఆయనకు ఛాన్స్ రాలేదు. మరోవైపు శ్రీజా మూడో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే కళ్యాణ్ దేవ్ కూడా చుట్టాల అమ్మాయితో వివాహానికి సిద్ధం అవుతున్నారనే కథనాలు వెలువడ్డాయి.