- Home
- Entertainment
- వెయ్యికోట్లకి అధిపతి, ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాల్సిందే.. ఊపేస్తున్న మెగాస్టార్ నయా ఫోటో
వెయ్యికోట్లకి అధిపతి, ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాల్సిందే.. ఊపేస్తున్న మెగాస్టార్ నయా ఫోటో
చిరంజీవి నయా లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఆయన సరికొత్త లుక్ ఊపేస్తుంది. రియల్ గాడ్ ఫాదర్ అని, యూటిట్యూడ్ ఇలా ఉంటుందని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మ పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని అతికొద్ది మందికి మాత్రమే ఈ అత్యున్నత పురస్కారం వరిస్తుంది. ఈ సారి మన తెలుగు వారిలో చిరంజీవితోపాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి వరించింది. దీంతో మెగాస్టార్ ఇంటికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. గత రెండు రోజులుగా చిరంజీవి ఇల్లు సినీ, రాజకీయ సెలబ్రిటీలతో కిటకిటలాడింది.
అయితే చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు,అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. వారితో ఫోటోలు దిగారు. అవి సోషల్ మీడియాలో సందడి చేశాయి. కానీ ఒక్క ఫోటో మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ సెన్సేషన్ డైరెక్టర్ చిరంజీవిని అభినందించిన అనంతరం కూర్చొని మాట్లాడే ఫోటో అది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఊపేస్తుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున కొత్తచర్చకు దారితీస్తుంది.
ఇంతగా వైరల్ గా మారడానికి కారణం రెండు అంశాలున్నాయి. ఒకటి `యానిమల్`తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వచ్చిన అభినందించడం. మెగాస్టార్‌ని చూసి ఆయనతో ముచ్చటడించడం. ఆయనతోపాటు మరో సంచలన దర్శకుడు `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓడెల ఉన్నారు. చిరుకి అభినందనలు తెలిపిన అనంతరం చాలా విషయాలను వీరి మధ్య చర్చకు వచ్చాయని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే వీరితో మాట్లాడే సమయంలో చిరంజీవి ఇచ్చిన లుక్ ఇప్పుడు అందరికి ఆకట్టుకుంటుంది. ఇందులో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు చిరంజీవి. వింటేజ్ చిరు కనిపిస్తున్నారు. `గ్యాంగ్ లీడర్` నాటి లుక్‌ని తలపిస్తుంది. ఆయన సీరియస్‌గా, స్టయిల్‌గా ఉంటే ఎలా ఉంటుందో అది చిరు తాజా లుక్‌లో కనిపిస్తుంది. ఫ్యాన్స్ కి ట్రీట్‌లా ఉంది. దీంతో ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. తెగ డిస్కషన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి యాటిట్యూడ్ అంటే ఇలా ఉంటుందని, రియల్ గాడ్ ఫాదర్ అని, మెగాస్టార్ అసలు మేనరిజం ఇది అని, అసలు యాటిట్యూడ్ ఇలా ఉంటుందని, కానీ మీడియా ముందు అలా ఉండకూడదని నార్మల్‌గా కనిపిస్తారని తెలిపారు. మరోవైపు వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి, టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు, ఇండస్ట్రీకి పెద్ద లాంటి వారు, అలాంటిది ఈ మాత్రం యాటిట్యూడ్ లేకపోతే ఎలా అంటున్నారు. దీంతో ఇప్పుడీ ఫోటో వైరల్ అవుతుంది.
అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. తనకు చిరంజీవి ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు. అంతేకాదు ఎలా ఇన్ స్పైర్ అయ్యాడో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో ఓ సినిమా పడితే బాగుంటుందని, సందీప్ రెడ్డి వంగాకి, చిరంజీవి లాంటి హీరో పడితే బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే అంటున్నారు. ఈ కాంబినేషన్‌ని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. `బింబిసార` ఫేర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.