Pawan Kalyan: పాపం సొంత ఇల్లు లేని పేద పవన్, 16 ఎకరాల ఫార్మ్ హౌస్లో తలదాచుకున్నాడట!
ఎలివేషన్స్ ఇవ్వొచ్చు కానీ... కొంచెం లాజిక్ ఉండేలా చూసుకుంటే బెటర్. మా తమ్ముడు పవన్ ఎంత నిస్వార్థపరుడంటే మొన్నటిదాక సొంత ఇల్లు కూడా లేదన్న చిరంజీవి వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి...
Pawan Kalyan
సమయం సందర్భం లేకుండా చిరంజీవి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నాడు. నాకు రాజకీయాలు సరిపడవంటూనే తమ్ముడిని ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ని మచ్చలేని చంద్రుడిగా, సామాన్య జనాల్లో తిరుగుతున్న యోగిగా అభివర్ణిస్తున్నారు. ప్రజా సేవ కోసమే పుట్టిన నేతగా కొనియాడుతున్నారు. అందులో తప్పేమీ లేదు. అదేదో నేరుగా చేస్తే సరిపోతుంది. జనసేనలో చేరి కీలక నేతగా రాజకీయాలు చేస్తే సరి.
Pawan Kalyan
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిరంజీవి జనసేన(Janasena) ప్రత్యర్థుల మీద పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో పవన్ ని ఈ శతాబ్దపు ఉత్తమ రాజకీయ వేత్తగా ఎలివేట్ చేస్తున్నాడు. అసలు చిన్నప్పటి నుండి సామాజిక భావాలతో ఎదిగిన సంఘ సేవకుడు అంటున్నారు. ఈ క్రమంలో పవన్ నిరాడంబర జీవితం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ లో లాజిక్ లేకుండా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎప్పుడూ సమాజం గురించే ఆలోచిస్తాడు. కించిత్ స్వార్థం కూడా ఉండదు. వేళకు అన్నడం తినడు. మంచి బట్టలు వేసుకోడు. పదవుల కాంక్ష, డబ్బు యావ ఉండదు. అంతెందుకు... మొన్నటి వరకు సొంత ఇల్లు కూడా లేదు, అన్నాడు. సినిమాకు నిర్మాతల దగ్గర నిలబెట్టి రూ. 50 కోట్లు తీసుకుంటున్న పవన్ కి సొంత ఇల్లు లేదంటే నమ్మగలమా..? అంటే ఆయన ఇల్లు కూడా లేకుండా అద్దెకు ఉంటున్నారా?
మరో విడ్డూరం ఏమిటంటే హైదరాబాద్ నడిబొడ్డు గండి పేటలో 16 ఎకరాల ఫార్మ్ హౌస్ పవన్ పేరున ఉంది. ఇప్పటికిప్పుడు లెక్క గట్టినా ఆ ఫార్మ్ హౌస్ విలువ రూ. 160 కోట్లు. ఇటీవలే అందులో ఉన్న పాత ఇంటిని కూలదోసి కొత్త ఇల్లు అన్ని హంగులు, ఆర్భాటాలతో కట్టారు. ఏళ్ల క్రితమే ఫార్మ్ హౌస్లు కొన్న పవన్ కి పాపం ఇల్లు లేదంట.
తమ్ముడిని సీఎంగా చూడాలనుకుంటే నేరుగా రంగంలోకి దిగడమే. ఇక రాజకీయాల్లోకి రానన్న ఒట్టు గట్టుమీద పెట్టడమే. ఈ ముసుగు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది?. మాట తప్పడం మనకేమీ కొత్త కాదు కదా. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు 'ఇకపై సినిమాల్లోకి వచ్చే సమస్యే లేదు ఈ జీవితం ప్రజాసేవకే అంకితం' అన్నారు. మరలా నాలుక కరుచుకుని రాజకీయాలు నావల్ల కాదని సినిమాల్లోకి వచ్చారు. దాని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి.
ఎప్పటి నుండో చిరంజీవి(Chiranjeevi) జనసేనలోకి రావాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని జనసేన వర్గాలు కోరుకుంటున్నాయి. దీనిపై పవన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆయన పార్టీలోకి వస్తే ప్రజారాజ్యం పరాజయం నీడలు జనసేనను ఆవహిస్తాయని ఆయన భయం. అలాగే అన్న హోదాలో ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అన్న జనసేనలో చేరడం పవన్, నాగబాబులకు నచ్చని అంశమే. కాబట్టి జనసేన నేతగా కాకుండా ఒక హీరోగా బయటనుండి పార్టీకి మద్దతు తెలపడం కలిసొస్తుంది అనుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే రానున్న కాలంలో చిరంజీవి మరిన్ని రాజకీయ రంగులు చూపించడం ఖాయం...