MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రాప్‌లో చిరంజీవి.. `ఆచార్య`కి తప్పని తిప్పలు.. తలలు పట్టుకుంటున్న అభిమానులు?

`ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రాప్‌లో చిరంజీవి.. `ఆచార్య`కి తప్పని తిప్పలు.. తలలు పట్టుకుంటున్న అభిమానులు?

మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రాప్‌లో పడ్డాడట. `ఆర్‌ఆర్‌ఆర్‌` మాయలో మునిగితేలుతున్నాడట. ఆ సినిమాని పట్టుకుని ఊగీసలాడుతుండటంతో అభిమానులు తలలు పట్టుకుంటున్నారట. మరి ఆ కథేంటో చూస్తే..

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 08 2022, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిరంజీవి(Chiranjeevi) ఇప్పుడు `ఆచార్య`(Acharya) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌(Ram Charan) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో చరణ్‌ నటిస్తున్న `సిద్ధ` పాత్ర అర్థగంటకుపైనే ఉంటుందని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల రిలీజ్‌ అయిన బాలయ్య `అఖండ` సైతం ఈ చిత్రానికి షాకిచ్చింది. `అఖండ`లోని ఎలివేషన్‌ సీన్లు చూసిన Chiranjeevi కొరటాల `ఆచార్య`ని ఆపరేషన్‌ చేయడం స్టార్ట్ చేశారట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

`అఖండ`లో భారీ ఎలివేషన్‌ సీన్లు, బీజీఎం మోత సినిమాని తిరుగులేని విజయంగా నిలబెట్టింది. దీంతో Acharyaలో అవి లోపించడంతో ఆ దిశగా మార్పులు చేస్తున్నారట. అందులో భాగంగానే కొంత రీషూట్‌ కూడా చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవి ఎలివేషన్‌ ఎలిమెంట్స్ మళ్లీ షూట్‌ చేసినట్టు సమాచారం. చాలా చోట్ల కరెక్షన్‌ చేస్తూ సినిమాని ఓ భారీ ప్యాకేజ్డ్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తుంది. అయితే అది ముందే చేసి ఉంటే ఈ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉండేది. కానీ పెద్ద అవకాశాన్ని మిస్‌ చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

37

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈసినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. కరోనా తీవ్రత మరింత పెరుగుతుంది. గత నాలుగు రోజుల్లోనే వైరస్‌ భయంకరంగా విజృంభిస్తోంది. దేశంలో లక్ష కేసులు దాటాయి. రాష్ట్రంలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో థియేటర్‌కి జనం వస్తారా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారితే, ఆ లోపు థియేటర్లు క్లోజ్‌ చేసే పరిస్థితి తలెత్తనుందనే టాక్‌ కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కరోనా పెరిగితే మొదట ప్రభావం పడేది థియేటర్లపైనే. దీంతో వాటిని క్లోజ్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్‌ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. నైట్‌ కర్ఫ్యూలు పెడుతుంది. ఇవి సినిమా విడుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. 

47

ఈ విషయాన్ని ముందే గ్రహించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) సినిమా వాయిదా వేసుకుంది.పరిస్థితులు కుదుట పడ్డాక, మళ్లీ రెట్టింపు ఎనర్జీతో సినిమాని విడుదల చేస్తామని, ఆడియెన్స్ సినిమాపై చూపించిన ప్రేమతో తిరిగి వస్తామని తెలిపింది. అయితే అదే మాదిరిగా ఇప్పుడు `ఆచార్య`ని కూడా వాయిదా వేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారట. కారణం కరోనా మాత్రమే కాదు, మరో బలమైన రీజన్‌ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పుడదే హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

57

RRR Movieలో Ram charan నటిస్తున్నారు. ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇది పాన్‌ ఇండియా మూవీ. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా విడుదలైతే సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. చిరంజీవి కూడా అదే బిలీవ్‌ చేస్తున్నారట. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తే.. రామ్‌చరణ్‌ రేంజ్‌ పెరిగిపోతుంది. ఆయనకు మార్కెట్‌ విస్తరిస్తుంది. అది `ఆచార్య` చిత్రానికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట చిరంజీవి. 

67

`ఆచార్య` చిత్రంలో చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్‌`కి సంబంధించిన చరణ్‌ తాలూకూ క్రెడిట్‌ `ఆచార్య` సినిమాకి ఉపయోగపడుతుందని, అది కలెక్షన్ల పరంగానూ బిగ్‌ హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట చిరంజీవి. అందుకే `ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదల తర్వాతనే `ఆచార్య`ని విడుదల చేయాలని భావిస్తున్నారట చిరు. 

77

ఇదే ఇప్పుడు అభిమానులను నిరాశకి గురిచేస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా పడిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన `ఆచార్య` చిత్రం వాయిదా పడబోతుందని, `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాతే ఈ చిత్రం రిలీజ్‌ అయ్యే అవకాశాలున్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఓ రకంగా ఇప్పుడు చిరంజీవి `ఆర్‌ఆర్‌ఆర్‌`ట్రాప్‌లో పడ్డారని అంటున్నారు. దాని వల్లే `ఆచార్య`కి కష్టాలు మొదలయ్యాయని, ఇప్పుడు ప్రకటించిన డేట్‌కి రావడం కష్టమని అంటున్నారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారట. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved