- Home
- Entertainment
- 'రుద్రవీణ' గుర్తు చేసుకుంటూ ఆవేశంతో ఊగిపోయిన చిరంజీవి.. రొమ్ము విరుచుకుని చెబుతున్నా..
'రుద్రవీణ' గుర్తు చేసుకుంటూ ఆవేశంతో ఊగిపోయిన చిరంజీవి.. రొమ్ము విరుచుకుని చెబుతున్నా..
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.

Acharya
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
Acharya
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నేను నటించిన రుద్రవీణ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాం. అక్కడ ఇండియన్ సినిమా వైభవం అంటూ మొత్తం హిందీ చిత్రాల పోస్టర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సౌత్ నుంచి ఎంజీఆర్ లాంటి ఒకరిద్దరి ఫోటోలు మాత్రమే కనిపించాయి.
Acharya
నాకు చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమాలు మాత్రమేనా అని అనిపించింది. ఈ విషయాన్ని నేను ఆ తర్వాత మీడియాలో కూడా ప్రశ్నించాను. కానీ సరైన సమాధానం దొరకలేదు. కానీ ఆ తర్వాత రోజుల్లో తెలుగు సినిమా గురించి రొమ్ము విరుచుకుని చెప్పే అవకాశం దక్కింది.
Acharya
అది కూడా రాజమౌళి రూపంలో. బాహుబలి.. ఆర్ఆర్ఆర్ చిత్రాలతో భాషా భేదాలు బద్దలు కొట్టి ఇండియన్ సినిమాని సృష్టించారు. రాజమౌళి మన తెలుగు వాడు కావడం మనకి గర్వకారణం అని చిరంజీవి అన్నారు.
Acharya
అలాంటి రాజమౌళిని సన్మానించాలి అని అన్నారు. వేదికపైనే చిరంజీవి రాజమౌళిని సన్మానించారు. ఇక ఆచార్య చిత్రానికి ఒకరకంగా కారణం రాజమౌళినే అని చిరంజీవి అన్నారు. రాజమౌళితో రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకే అయింది. అదే సమయంలో రాంచరణ్ కోసం కొరటాల శివ కూడా కథ రెడీ చేసుకున్నారు.
Acharya
ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో రాంచరణ్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసే లోపు నాతో ఒక సినిమా చేస్తావా అని అడిగాను. వెంటనే కొరటాల సంతోషంతో ఆచార్య కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో సిద్ద పాత్ర కోసం రాంచరణ్ ని అనుకోవడంతో మళ్ళి సమస్య వచ్చింది.
Acharya
దీనితో రాజమౌళిని రిక్వస్ట్ చేశాను. దీనితో రాజమౌళి అవకాశం ఉన్నప్పుడల్లా ఆర్ఆర్ఆర్ నుంచి చరణ్ ని రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఆ గ్యాప్ లో రాంచరణ్ పాత్రని ఫినిష్ చేసినట్లు చిరంజీవి తెలిపారు. పాండమిక్ వల్ల అన్ని సినిమాలు ఇబ్బంది పడినప్పటికీ రాజమౌళి ఇచ్చిన మాట తప్పలేదు.