Ram Charan: చరణ్ కి అబ్బాయి పుట్టాలి... అక్క సుస్మిత ఆసక్తికర కామెంట్స్
రామ్ చరణ్ కి అబ్బాయి పుడితే బాగుండంటూ మనసులో కోరిక బయటపెట్టింది చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత. దానికి ఓ కారణం కూడా ఉందట.
Ram Charan
రామ్ చరణ్(Ram Charan) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది చిరంజీవి ఈ బ్రేకింగ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్న వార్త మెగా అభిమానులను ఊపేసింది. ఎందుకంటే వారు ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభవార్త అది. 2012లో చరణ్-ఉపాసనల వివాహం జరిగింది. అంటే దశాబ్దం దాటిపోయినా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో ఉపాసనను ఉద్దేశిస్తూ అనేక ఘోరమైన రూమర్స్ తెరపైకి వచ్చాయి.
విమర్శలకు, అనుమానాలకు, ఊహాగానాలకు రామ్ చరణ్-ఉపాసన చెక్ పెట్టారు. ఉపాసన తన గర్భంలో బిడ్డను మోస్తున్నారు. ఈ ఏడాది వారి జీవితాల్లోకి కొత్త వ్యక్తి రానున్నారు. చరణ్ తండ్రి కావడంపై అక్క సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె అబ్బాయి పుడితే బాగుండన్న అభిప్రాయం వెల్లడించారు. సుస్మిత మాట్లాడుతూ... చరణ్ తండ్రి కాబోతున్నాడన్న వార్త మా కుటుంబంలో పండగ తీసుకొచ్చింది. ఫ్యామిలీ మొత్తం ఈ విషయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాము.
చరణ్ కి పాప, బాబులలో ఎవరు పుట్టినా సంతోషమే. అయితే అబ్బాయి పుడితే బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి అబ్బాయి పుడితే ఆ కోరిక కూడా తీరుతుందని నా ఆశ అని మనసులో మాట వెల్లడించారు. సుస్మిత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సుస్మిత చిరంజీవి సంతానంలో మొదటి అమ్మాయి. తర్వాత చరణ్, చివరిగా శ్రీజా పుట్టారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)తో గ్లోబల్ రికగ్నిషన్ చరణ్ అందుకున్నారు. ఆయనకు హాలీవుడ్ మూవీ ఆఫర్స్ వస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఇక చరణ్ స్వయంగా ఆరు కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు వెల్లడించారు. దర్శకుడు శంకర్ తో చేస్తున్న మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రకటించారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మిగతా నాలుగు ప్రాజెక్ట్స్ ఎవరితో అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది.
కాగా రాజమౌళి(Rajamouli) ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రామరాజుగా చరణ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై విజృభించనున్నాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేందుకు చాలా సమయం ఉంది. ముందు రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. వెంటనే ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఉంటుందా? లేక రాజమౌళి మరో చిత్రం ఏదైనా చేస్తాడా? అనేది తెలియదు.