బాహుబలి కన్నా మగధీరనే బావుంటుందా ? చిరంజీవి ఏమన్నారో తెలుసా
పదేళ్ల క్రితం విడుదలైన బాహుబలి సినిమా గురించి చిరంజీవి చేసిన మొట్ట మొదటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి కంటే మగధీరనే బావుంది అని అప్పట్లో జరిగిన చర్చపై కూడా చిరంజీవి స్పందించారు.

బాహుబలి ది ఎపిక్ సంచలనాలు
తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. రాజమౌళి తన విజన్ తో అసాధ్యం అనుకున్న భారీ చిత్రాన్ని సుసాధ్యం చేశారు. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ కి బాటలు వేశారు. బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బాహుబలి 1, బాహుబలి 2 రెండు భాగాలని కలిపి ఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా బాహుబలి సంచలనాలు సృష్టిస్తోంది.
మొదటి రోజు నెగిటివ్ టాక్
దీనితో మరోసారి ప్రేక్షకులంతా బాహుబలి విశేషాలని గుర్తు చేసుకుంటున్నారు. బాహుబలి 1 రిలీజైనప్పుడు ఇండస్ట్రీ నుంచి మంచి మద్దతు లభించింది. పైరసీ నివారణ కోసం ఇండస్ట్రీ మొత్తం బాహుబలి చిత్ర యూనిట్ కి సపోర్ట్ గా నిలిచారు. మూవీ రిలీజైన తర్వాత సెలెబ్రిటీలు అద్భుతంగా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి ఎలాంటి చిత్రం విడుదలైనా తన మద్దతు తెలియజేస్తుంటారు. ఇటీవల చిరంజీవి చిన్న చిత్రాలని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. బాహుబలి 1 రిలీజైనప్పుడు మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది.
బాహుబలి కంటే మగధీరనే బావుంటుందా ?
చిరంజీవి బాహుబలి మూవీ చూడకుండా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి చిత్రానికి వచ్చిన నెగిటివ్ టాక్ గురించి మీడియా చిరంజీవిని అడగగా.. ఎలాంటి అంచనాలు లేకుండా చూసిన వారు మాత్రం మూవీ బావుందని అంటున్నారు. బాహుబలి లాంటి సినిమాలు తప్పకుండా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బావుంటుంది అని చిరంజీవి అన్నారు. బాహుబలి కన్నా మగధీరనే బావుందని అంటున్నారు కదా అని మీడియా ప్రతినిధి అడగగా.. అది ఇప్పుడే చెప్పలేం అని చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాహుబలిపై చిరంజీవి ప్రశంసలు
చిరంజీవి చేసిన వ్యాఖ్యలు బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. బాహుబలి మూవీ చూసిన తర్వాత కూడా చిరంజీవి స్పందించారు. రాజమౌళి ధైర్యానికి హ్యాట్సాఫ్. తెలుగు సినిమా స్టామినా ఇంత ఉందా అని ఆశ్చర్యం కలిగినట్లు చిరంజీవి తెలిపారు. లెక్కకు మించిన బడ్జెట్ పెడితే రిటర్న్స్ వస్తాయా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కానీ రాజమౌళి ఎంతో ధైర్యంగా ముందడుగు వేశారు. అలాంటి నిర్మాతలు దొరకడం కూడా రాజమౌళి అదృష్టం. మొత్తంగా ఒక గొప్ప ప్రయత్నం చేసి రాజమౌళి విజయవంతం అయ్యారు అని చిరంజీవి అభినందించారు.
రెండూ రాజమౌళి సినిమాలే
మగధీర, బాహుబలి రెండు సినిమాలు రాజమౌళి తెరకెక్కించినవే. రెండు చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. బాహుబలి 2 అయితే కలెక్షన్స్ లో బాలీవుడ్ చిత్రాలకు సవాల్ విసిరింది.