పొలిటిక్స్ పై చిరంజీవికి క్లారిటీ: పవన్ కల్యాణ్ రాజకీయాలపైనా...

First Published 27, Sep 2019, 12:38 PM

ప్రస్తుతం అక్టోబర్ 2వ తేదీన విడుదలవుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాతో ఆయనకు మరింత స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. దాంతో తమిళ పత్రికతోనే రాజకీయాలపై ఆయన స్పష్టంగానే మాట్లాడారు. సున్నిత మనస్కులు రాజకీయాలకు పనికి రారని ఆయన చెప్పారు. 

రాజకీయాల్లో కొంత కాలం డక్కామొక్కీలు తిన్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఓ స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలని ఆయనకు అనుభవం నేర్పినట్లే ఉంది. అందుకే తిరిగి సినీ రంగానికి వచ్చారు. ఖైదీ 150 విజయం తర్వాత ఆయనకు క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం అక్టోబర్ 2వ తేదీన విడుదలవుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాతో ఆయనకు మరింత స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. దాంతో తమిళ పత్రికతోనే అయినా రాజకీయాలపై ఆయన స్పష్టంగానే మాట్లాడారు. సున్నిత మనస్కులు రాజకీయాలకు పనికి రారని ఆయన చెప్పారు. అంతేకాదు, రాజకీయాలు వద్దని తమిళ సూపర్ స్టార్స్ రజినీకాంత్ కు, కమల్ హాసన్ కు సలహా కూడా ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

ఇదిలావుంటే, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అదే గుణపాఠం నేర్చుకున్నారు. సైరా సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ ప్రధానమైన పాత్రను పోషించారు. రాజకీయాల పట్ల అమితాబ్ ఇది వరకే అయిష్టతను వ్యక్తం చేశారు. రాజకీయాలు ఒంటికి పడవని కూడా ఆయన ఓ నిర్ధారణకు వచ్చారు. అదే తరహా అనుభవాన్ని చిరంజీవి కూడా ఎదుర్కున్నారు.

చిరంజీవి 2008 ఆగస్టులో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి కేవలం 18 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయగా, తిరుపతి నుంచి గెలిచి, తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. కాంగ్రెసు అధిష్టానం ఆయనను రాజ్యసభకు ఎన్నిక చేసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయనను ముందు పెట్టాలని సమైక్యవాదులు ప్రయత్నించారు.

హైదరాబాదులో కేంద్ర పాలిత ప్రాంతంగా చేయించడానికి చిరంజీవి చివరి వరకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్నారు. చివరకు ఆయన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓడిపోయి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తన పదవీ కాలం ముగియగానే చిరంజీవి దాదాపుగా రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పవచ్చు..

రాజకీయాలకు దూరం జరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించారు. సినిమా రంగంలో తనకున్న ఇమేజ్ ను, అభిమానులు తన పట్ల చూపుతున్న ఆదరణను గమనించారు. బహుశా, తాను సినీ రంగానికి దూరం కావడం పట్ల ఆయన ఆవేదన చెందే ఉంటారని అనుకోవచ్చు. సైరా సినిమా తర్వాత ఆయనకు పూర్తి స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది

ప్రజారాజ్యం విఫలం కావడం పట్ల ఆ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహిస్తున్న చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తిరిగి రాజకీయాల్లో సత్తా చాటడానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం చిరంజీవికి ఇష్టం లేదనే విషయం స్పష్టమే. చిరంజీవి కొద్ది సందర్భాల్లో ఆ విషయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు కూడా

డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయని చిరంజీవి భావిస్తున్నట్లు తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ స్పష్టం చేస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం వల్లనే తాను ఓడిపోయానని, ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అందుకే ఓడిపోయారని ఆయన స్పష్టంగానే చెప్పారు. అందువల్ల తనలాంటివాళ్లు రాజకీయాల్లో నెగ్గుకురాలేమనే విషయాన్ని చిరంజీవి భావిస్తున్నారు దీన్ని బట్టి చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి అడుగు పెట్టకూడదనే భావిస్తున్నారని తెలుస్తోంది