- Home
- Entertainment
- కృష్ణ `అగ్నిపర్వతం`తో పోటీపడి కోలుకోలేని దెబ్బతిన్న చిత్రాలివే.. చిరంజీవి, బాలయ్యకు చెమటలు
కృష్ణ `అగ్నిపర్వతం`తో పోటీపడి కోలుకోలేని దెబ్బతిన్న చిత్రాలివే.. చిరంజీవి, బాలయ్యకు చెమటలు
సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన `అగ్నిపర్వతం` మూవీ సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రంతో పోటీ పడి బాలయ్య, చిరంజీవి నటించిన చిత్రాలు చతికిల పడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ `అగ్నిపర్వతం`తో పోటీ పడి ఫెయిల్ అయిన చిత్రాలు
నేడు శనివారం(నవంబర్ 15) సూపర్ స్టార్ కృష్ణ రెండో వర్థంతి. రెండేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా కృష్ణ `అగ్నిపర్వతం` మూవీతో పోటీ పడి గట్టి దెబ్బ తిన్న చిత్రాలకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. వీటిలో చిరంజీవి, బాలయ్య మూవీస్ ఉండటం గమనార్హం. మరి ఈ మూవీ ఎప్పుడు వచ్చింది. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో పోటీ పడ్డ సినిమాలేంటనేది తెలుసుకుందాం.
సంచలనం సృష్టించిన కృష్ణ `అగ్నిపర్వతం`
సూపర్ స్టార్ కృష్ణ 1980లో హీరోగా పీక్‌లో ఉన్నారు. ఆయన 70 నుంచే స్టార్ హీరోగా రాణిస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్నారు. ఆ ఫ్లోలో వచ్చిన మరో మూవీ `అగ్నిపర్వతం`. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1985 జనవరి 11న విడుదలైంది. సంక్రాంతి కానుకగా వచ్చింది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమారం రేపింది. సంక్రాంతి సీజన్ కావడంతో అందరి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయించాయి. అందులో `అగ్గిపెట్టి ఉందా` అంటూ కృష్ణ అడిగే డైలాగ్ లకు మాస్ ఆడియెన్స్ ఊగిపోయారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ డైలాగ్ మారుమోగిందంటే అతిశయోక్తి కాదు.
అగ్నిపర్వతం తిరుగులేని రికార్డు
ఇందులో కృష్ణకి జోడీగా రాధా, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు నెగటివ్ రోల్స్ చేశారు. అశ్వనీదత్ నిర్మించారు. ఈ మూవీ కమర్షియల్‌గా సునామీ సృష్టించింది. ఎనిమిది సెంటర్లలో 125 రోజులు ప్రదర్శించబడింది. కృష్ణకి ఆ టైమ్‌లో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. అయితే దీనితో పోటీ పడి పలు చిత్రాలు బోల్తా కొట్టాయి. పెద్ద హిట్ కావాల్సిన చిత్రాలు యావరేజ్‌గా మారితే, మామూలు మూవీస్ డిజాస్టర్‌గా నిలిచాయి.
`అగ్నిపర్వతం`తో పోటీ పడి చతికిల బడ్డ చిరంజీవి మూవీ
కృష్ణ `అగ్నిపర్వతం`కి పోటీగా విడుదలైన మూవీ `చట్టంతో పోరాటం`. ఇందులో చిరంజీవి హీరో. ఆయన సరసన మాధవి, సుమలత హీరోయిన్లుగా నటించారు. రావు గోపాలరావు విలన్. కే బాపయ్య దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగానే జనవరి 11నే విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. `అగ్నిపర్వతం` జోరు ముందు చతికిలపడింది. ఆడియెన్స్ అంతా కృష్ణ మూవీ వైపు మొగ్గు చూపడంతో హిట్ కావాల్సిన `చట్టంతో పోరాటం` కేవలం యావరేజ్‌గానే ఆడింది. నిర్మాతలను కొంత నిరాశ పరిచింది.
డిజాస్టర్ అందుకున్న బాలయ్య
కృష్ణ `అగ్నిపర్వతం`కి రెండు వారాల గ్యాప్‌తో బాలయ్య హీరోగా వచ్చిన `ఆత్మబలం` మూవీ విడుదలైంది. దీనికి తాతినేని ప్రసాద్ దర్శకుడు. రొమాంటిక్ మ్యూజిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1985 జనవరి 24న విడుదలైంది. ఇందులో భానుప్రియా హీరోయిన్. సిల్క్ స్మిత ఓ పాత్రలో మెరిసింది. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఏమాత్రం అలరించలేకపోయింది. అప్పటికే `అగ్నిపర్వతం` జోరు నడుస్తుంది. దీంతో బాలయ్య సినిమా అలరించలేకపోయింది. ఆడియెన్స్ కృష్ణ మూవీకే ఎగబడ్డారు. దీంతో బాలయ్య `ఆత్మబలం` డిజాస్టర్‌గా నిలిచింది.
హిట్ కొట్టిన సుమన్, నరేష్
అయితే ఈ సినిమాకి ఒక్క రోజు గ్యాప్‌తో వచ్చిన కామెడీ చిత్రాలు, ఫ్యామిలీ మూవీస్ మంచి ఆదరణ పొందాయి. సుమన్, రాజేంద్రప్రసాద్ నటించిన `దేశంలో దొంగలు పడ్డారు` సూపర్ హిట్ అయ్యింది. దీంతోపాటు నరేష్ నటించిన `పుత్తడి బొమ్మ` సైతం ఆకట్టుకుని విజయం సాధించింది. అయితే ఇవి చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు. కానీ బాలయ్య, చిరంజీవి మూవీస్ భారీ బడ్జెట్‌తో రూపొందాయి. దీంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలా మొత్తంగా చిరంజీవి, బాలయ్యకి తన `అగ్నిపర్వతం`తో చెమటలు పట్టించారు కృష్ణ.