ఆ మూవీ ఎందుకు ఒప్పుకోలేదు అని చరణ్ ని తిట్టిన చిరంజీవి, కట్ చేస్తే బిగ్ డిజాస్టర్.. ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో ఒక భారీ డిజాస్టర్ నుంచి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. మగధీర తర్వాత రాంచరణ్ కి ఎలాంటి సినిమా చేయాలనే డైలమా ఉండేది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో ఒక భారీ డిజాస్టర్ నుంచి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. మగధీర తర్వాత రాంచరణ్ కి ఎలాంటి సినిమా చేయాలనే డైలమా ఉండేది. అనేక కథలు పరిశీలించి ఆరెంజ్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆరెంజ్ చిత్రం అప్పటికి ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటికీ ఈ చిత్రంపై క్రేజ్ ఉంది. రీరిలీజ్ లో కూడా రికార్డులు సృష్టించింది.
ఆరెంజ్ మూవీ చేస్తున్నపుడు చరణ్ కి చరణ్ కి మగధీర తరహాలో భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ తన ఫ్రెండ్ అయినప్పటికీ చరణ్ ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. తన ఫ్రెండ్ ని నొప్పించకుండా తర్వాత మరో చిత్రం చేద్దాం అని తెలివిగా తప్పించుకున్నాడట.
ఆ మూవీ మరేదో కాదు.. అనగనగా ఓ ధీరుడు. ఈ చిత్రానికి దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్. రాంచరణ్, ప్రకాష్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చిరంజీవి ఇంట్లో చరణ్, ప్రకాష్ గంటలు గంటలు గడిపేవారట. అనగనగా ఓ ధీరుడు చిత్ర టీజర్ ట్రైలర్ విడుదలయ్యాక చిరంజీవి రాంచరణ్ ని తిట్టారట. డైరెక్టర్ నీ ఫ్రెండ్.. ఇంత మంచి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు అని తిట్టారట.
కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక దారుణమైన పరాజయంగా నిలిచింది. ప్రకాష్ అనుభవలేమి ఈ చిత్రంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఒప్పుకోలేదని నాన్న గారు తనని తిట్టినట్లు చరణ్ ఆడియో వేడుకలో రివీల్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి, మగధీర రెండు చిత్రాలు కలిపితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది అని చరణ్ హైప్ ఇచ్చాడు. ఇక తాను జగదేక వీరుడు అతిలోక సుందరి 2 చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు.
ఆడియో వేడుకకి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి లాంటి వారంతా హాజరై ఈ చిత్రానికి హైప్ ఇచ్చారు. కానీ ఎవ్వరూ ఈ మూవీని కాపాడలేడు. సిద్దార్థ్ హీరోగా, శృతి హాసన్ హీరోనే గా నటించారు. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించింది. సిల్లీగా అనిపించే గ్రాఫిక్స్, కథ కథనాలు ఏమాత్రం ఆడియన్స్ కి నచ్చలేదు. మొత్తంగా చరణ్ తండ్రి దగ్గర తిట్లు తిన్నా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు.