బాబీతో మరో మూవీని ప్రకటించిన మెగాస్టార్, స్పెషల్ పోస్టర్ తో సర్ప్రైజ్ చేసిన టీమ్
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా తన 70వ బర్త్ డే సందర్భంగా చిరంజీవి మరో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి అప్ డేట్స్ ను అందించారు చిరు.

చిరంజీవి వరుస సినిమాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వంభర’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఎలాగైనరా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబాలని పట్టుదలతో ఉన్నారు టీమ్.
KNOW
మెగాస్టార్ బర్త్ డే కానుక
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. అంతే కాదు వెంటనే దానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇది మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ (K.S. రవీంద్ర) డైరెక్ట్ చేయనున్నారు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ కలిసి పని చేయబోతోందన్న వార్త అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
Glad to team up once again with my dear @dirbobby and to join hands with @KvnProductions on this special journey ❤️🔥#MEGA158#ChiruBobby2@LohithNK01pic.twitter.com/2FP05iQzkK
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 22, 2025
మెగా 158 కాన్సెప్ట్ పోస్టర్
చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లో ఒక గొడ్డలి, నెత్తురు వంటివి కనిపించాయి. దీన్ని బట్టి సినిమా యాక్షన్ ప్రధానంగా ఉండనుందని అభిమానులు ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. సెప్టెంబర్ 2025లో షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని నిర్వర్తించనున్నారు. ఇక ఈసినిమాలో హీరోయిన్ ఎవరు, ప్రధాన పాత్రల్లో ఎవరు నటించబోతున్నారు అనే వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సమాచారం.
మన శంకర వరప్రసాద్ గారు
ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాను చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతే కాదు ఈసినిమా నుంచి తాజాగా చిరంజీవి బర్త్ డే సందర్భంగా స్పెషల్ అప్ డేట్స్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాను ఇయర్ ఎండ్ వరకూ పూర్తి చేసి , వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక తాజాగా ప్రకటించిన బాబీ సినిమా కూడా అదే సంవత్సరం లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
విశ్వంభర మరింత ఆలస్యం
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. బాబీ దర్శకత్వంలో ఆయన 158వ సినిమా అధికారికంగా ప్రకటించడమే కాకుండా, పోస్టర్ ద్వారా సినిమాపై ఆసక్తి పెంచారు. అభిమానులకు ఇది నిజంగా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ నటించి విశ్వంభర మాత్రం మరింత ఆలస్యం కాబోతోంది. ఈసినిమా గ్రాఫిక్ వర్క్ కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉండటం వల్ల, ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు చిరంజీవి ఓ సందర్భంలో వెల్లడించారు.