చరణ్,ఎన్టీఆర్, మహేష్, బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్, పరిశీలనలో ఉన్న టైటిల్స్ ఇవే...?
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల చాలా సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇంకొన్ని సెట్స్ ఎక్కబోతున్నాయి. అయితే ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ ఇంకా అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ బాలయ్య, చరణ్. మహేష్ ఇలా స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ మాత్రం ఇదిగో అదిగో అంటూ... డిలే చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని టైటిల్స్ మాత్రం పరిశీలనలో ఉన్నట్టు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ స్టార్ హీరోలకు పరిశీలనలో ఉన్న టైటిల్స్ ఏంటీ..?
ఇప్పుడు స్టార్ హీరోలంతా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్ జోష్ తో చరణ్ దూసుకుపోతున్నాడు. ఆయన తాజా మూవీ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. అందుకే ఈమూవీకి అధికారి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఈ మూవీలో చరణ్ జో్డీగా కియారా అద్వాని నటిస్తోంది.
సర్కారువారి పాట హడావిడి అయిపోయింది... ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ప్రాజెక్టు ప్రలెక్కనుంది. ఈ సినిమా ఓపెనింగ్ ఎప్పుడో అయిపోయింది.. రెగ్యులర్ షూటింగు త్వరలో మొదలుకానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తరువాత తన 30వ సినిమా కోసం కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా అసురుడు అనుకుంటున్నారు. మాస్ యాక్షన్ జోనర్లో ఈ కథ నడుస్తుందట.
ఇక నందమూరి నట సింహం బాలయ్య బాబు అఖండ సినిమా అఖండ విజయంతో జోరు చూపిస్తున్నాడు. మలినేని గోపీచంద్ తో సినిమా దాదాపుగా పూర్తి కావస్తుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ మాత్ర అనౌన్స్ చేయలేదు టీమ్. ఈ సినిమాకు వేటపాలెం లాంటి మరికొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈనెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.