యాంకర్ సుమకు గుణపాఠం నేర్పిన కొడుకు... ఇమేజ్ డ్యామేజ్, ఇకనైనా మారుతుందా?
సినిమా అన్నాక జయాపజయాలు సాధ్యం. అయితే కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హోమ్లీ యాంకర్ ఇమేజ్ ఉన్న యాంకర్ సుమ... కొడుకును లాంచ్ చేసిన తీరు విమర్శల పాలవుతుంది.
Anchor Suma Kanakala
సుమ కనకాల లెజెండరీ తెలుగు యాంకర్. దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా సుమ కనకాలకు పోటీ ఇచ్చే యాంకర్ పరిశ్రమలో లేదు. ఆమె అనేక మేజర్ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేశారు.
Anchor Suma Kanakala
సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల కూడా సెలెబ్రిటీనే. ఆయన నటుడిగా రాణిస్తున్నారు. వీరిద్దరికీ పరిశ్రమలో పలుకుబడి ఉంది. అందుకే కొడుకు రోషన్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. రోషన్ డెబ్యూ మూవీ బబుల్ గమ్ కి మంచి ప్రచారం దక్కింది. కారణం స్టార్స్ ఈ చిత్రాన్ని ప్రోమోట్ చేశారు.
ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఫలితం మాత్రం నెగిటివ్ గా వచ్చింది. సినిమా అన్నాక జయాపజయాలు సాధ్యం. అయితే కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిన బబుల్ గమ్ మూవీలో రొమాన్స్ డోస్ మోతాదుకు మించి ఉంది. లెక్కకు మించిన లిప్ లాక్ సన్నివేశాలతో సినిమా నింపేశారు. ఇది ముక్కు మొహం తెలియని కుర్రాడి సినిమా అయితే విమర్శలు వచ్చేవి కావు.
Bubble Gum Trailer launch event
సుమ బుల్లితెర ప్రేక్షకుల రోల్ మోడల్. ఆమె మాట తీరు, కట్టు బొట్టును ఫాలో అయ్యే జనాలు ఉన్నారు. హోమ్లీ యాంకర్ గా పేరున్న సుమ కనకాల వారసుడి మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని స్థాయిలో ఉంది. ఈ క్రమంలో సుమ తన కొడుకును లాంచ్ చేసే విధానం ఇదేనా అంటున్నారు.
కొడుకు రోషన్ నటించిన బబుల్ గమ్ మూవీ సుమ పరువు తీసింది. అదే సమయంలో డబ్బులు కూడా నష్టం. ఈ సినిమాను సుమనే నిర్మించారు. బబుల్ గమ్ తో సుమకు మరో దెబ్బ తగిలినట్లు అయ్యింది.
ఇటీవల సుమ జర్నలిస్టులపై చిన్న జోక్ వేసి వివాదం రాజేశారు. మీడియా ప్రతినిధులు మండి పడటంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ మధ్య భర్తతో విభేదాలంటూ వార్తలు వచ్చాయి. చూస్తుంటే ఈ మధ్య సుమకు కాలం కలసి రావడం లేదు. ఆమెకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి...