బ్రేకింగ్ న్యూస్... కోలుకున్న సమంత, త్వరలో కెమెరా ముందుకు, కీలక విషయాలు వెల్లడించిన సన్నిహితులు!
సమంత హెల్త్ కండిషన్ పై పలు పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనం ప్రచురించారు. సమంత కోలుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయని తెలియజేశారు.
Samantha
అక్టోబర్ 29న సమంత బిగ్ బాంబు పేల్చారు. తనకు మయోసైటిస్ సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ వ్యాధి గురించి సాధారణ జనాలకు ఐడియా లేదు. సమంత సందేశం కొంచెం భయపెట్టేదిగా ఉంది. ఇక మీడియా దీనిపై చర్చలు పెట్టి, డాక్టర్స్ ని డిబేట్లకు పిలిచి విషయం పెద్దది చేశారు. మయోసైటిస్ అత్యంత ప్రాణాంతక వ్యాధి, సమంతకు ఏమైనా కావొచ్చని ప్రొజెక్ట్ చేశారు.
samantha about her disease
ఈ క్రమంలో అనేక నిరాధార కథనాలు పుట్టుకొచ్చాయి. ఆమె చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లారని, కేరళలో ఈ వ్యాధికి మంచి ట్రీట్మెంట్ ఉందని, ఆ ప్రకృతి చికిత్స కూడా ఫాలో అవుతున్నారంటూ... పలు వాదనలు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మొదట్లో ఒక క్లారిటీ ఇచ్చిన సమంత... పుకార్లపై స్పందించడం మానేశారు.
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త ప్రచురించింది. తమ ప్రతినిధి సమంత సన్నిహితులతో మాట్లాడి విషయం రాబట్టినట్లు సదరు కథనంలో తెలియజేశారు. సమంత మిత్రులు ఏం చెప్పారంటే... ఆమె మయోసైటిస్ నుండి కోలుకున్నారు. ఫుల్ జోష్ తో సమంత కెమెరా ముందుకు రాబోతున్నారు.
సమంత(Samantha) ఆరోగ్యం గురించి మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఉన్నదీ లేనిదీ రాస్తురు. సమంత గొప్ప ఫైటర్. విషయం ఏదైనా వెనక్కి తగ్గే రకం కాదు. విడాకుల విషయంలో ఆమె సామాజిక వేధింపులకు గురయ్యారు. వాటిని కూడా ఆమె తట్టుకొని నిలబడ్డారు. దాంతో పోల్చుకుంటే మయోసైటిస్ ఆమెకు చాలా చిన్న విషయం.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో చేస్తున్న ఖుషి షూటింగ్ 80% శాతం కంప్లీట్ అయ్యింది. ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేయనుంది. నెక్స్ట్ సిటాడెల్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటారు. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి. కరణ్ జోహార్, దినేష్ విజన్ వంటి నిర్మాతలు తమ చిత్రాల్లో సమంత పేరు పరిశీలిస్తున్నారు, అని చెప్పుకొచ్చారు.
కాబట్టి... సమంత ఆరోగ్యం మరింత క్షీణించింది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్స్ నుండి తప్పు కున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. సమంత క్లోజ్ ఫ్రెండ్స్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.