- Home
- Entertainment
- మీలాంటి ఇన్నోసెంట్ దొరకడం అరుదు.. బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకి రకుల్ హార్ట్ టచ్చింగ్ పోస్ట్..
మీలాంటి ఇన్నోసెంట్ దొరకడం అరుదు.. బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకి రకుల్ హార్ట్ టచ్చింగ్ పోస్ట్..
రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ కి చెక్కేసి తెలుగులో సినిమాలు మానేసింది. అంతేకాదు అక్కడే ప్రియుడిని కూడా చూసుకుంది. తరచూ ఆయనతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.

రకుల్ ప్రీత్ సింగ్.. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో మునిగితేలుతుంది. ఇద్దరు గత కొన్ని రోజులుగా ఘాటుగా ప్రేమించుకుంటున్నారు. ఓపెన్‌గానే తమ ప్రేమ విషయాన్ని చాటుకుంటున్నారు. ఇద్దరు కలిసి తరచూ ముంబయిలో జరిగే ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తమ ప్రేమ అంతా ఓపెన్ అని చాటి చెబుతున్నారు.
నేడు జాకీ భగ్నానీ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జాకీని ఉద్దేశించి రకుల్ పోస్ట్ పెట్టింది. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ హార్ట్ టచ్చింగ్ పోస్ట్ పెట్టింది. ఇందులో రకుల్ చెబుతూ , హ్యాపీ బర్త్ డే నా లవ్. ఈ పుట్టిన రోజు, ప్రతి రోజూ నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలి. దానికి నువ్వు అర్హుడివి కూడా.
మీ దయగల గుణం, అమాయకత్వం ఉన్న వ్యక్తి దొరకడం చాలా అరుదు. నీ జోకులు చాలా వెర్రీగా ఉంటాయి. కానీ అవి ఫన్నీగా ఉన్నాయని నేను యాక్సెప్ట్ చేయాలి. మీలా మరే వ్యక్తి ప్రేమించలేరు. మీతో కలిసి చేసే సాహసాలు, ప్రయాణం, తినడం, నవ్వడం కలిసి ఎల్లప్పుడు చేయాలని కోరుకుంటున్నా. అలాగే వాటిన పదిలంగా ఉంచుకోవాలనుకుంటున్నా` అని చెబుతూ పోస్ట్ పెట్టింది రకుల్. ఇన్‌స్టాగ్రామ్ లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అవి వైరల్ అవుతున్నాయి.
Rakul preet singh
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆయన ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు. మరి తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారా? లేదా అనేది చూడాలి. అయితే బహుశా ప్రియుడి కోసమేనేమో ఆమె బాలీవుడ్‌కే పరిమితమయ్యింది.
Rakul Preeth Singh
దాదాపు రెండేళ్లుగా తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. సౌత్ వైపు చూసే ఆలోచన కూడా ఆమెలో కనిపించడం లేదు. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె `ఇండియన్ 2`లో నటిస్తుంది రకుల్. దీంతోపాటు రెండు హిందీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. కొత్తగా మరేది ప్రకటించలేదు.