శత్రువులను కమెడియన్లుగా చూడండి.. కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కుబ్రాండ్ అంటే కంగనా రనౌత్ పేరే వినిపిస్తుంది. ఇది అది అని లేకుండా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉండే కంగనా.. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు. రీసెంట్ గా అదే పని చేశారు కంగనా.

అన్ని అంశాలపై స్పందిస్తుంది కంగనా. తనకు నచ్చనివారిని.. తప్పుడ చేశారు అనుకన్న వారిని ఎంతటివారు అయినా సరే.. సోషల్ మీడియాలో కడిగిపడేస్తుంది. కంగనా. రాజకీయ అంశాల్లో కూడా ఇలా వేలు పెట్టే చాలా విమర్షలు ఫేస్ చేసింది.
বাংলা-কঙ্গণা-রানাওয়াত
మహిళలకోసం.. పురుషాదిపత్యంపై ప్రశ్నిస్తూ.. పోరాటం చేసే కంగనా.. ఎప్పుడూ.. మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలంటూ చెబుతూ ఉంటారు.ఇక తాజాగా మహిళలకు సబంధించి ఓ పోస్ట్ పెట్టారు కంగనా. తమ వంతు వచ్చేవరకూ వెయిట్ చేయకుండా.. స్త్రీలు తమకు తామే టైమ్ ను తెచ్చుకోవాలి అన్నారు. స్వయంగా ఏదో ఒకటి సాధించి చూపించాలన్నారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సినిమాలతో పాటూ రాజకీయాలపై ఘాటుగా స్పందిస్తుంటారు. వాటి వల్ల ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటారు. అందుకే కంగనాను అభిమానించేవారు ఎంత మంది ఉన్నారో.. అంతకు మించి ద్వేశించేవారు కూడా ఉన్నారు.
ఎవరో ఏదో చేశారు అని తాను బాధపడనంటోంది బాలీవుడ్ బ్యూటీ. అవమానాలు, అసమానతలు, వైఫల్యాలు, అనుచిత ప్రవర్తన లాంటి భావోద్వేగాలను వాడుకోవడం తనకు ఇష్టముండదంటోంది. అయితే వాటిని తమ సామర్జ్యాలను పెంచుకోవడం కోసం ఉపనయోగించుకోవాలి అన్నారు.
జీవితంలో ఎదురయ్యే విమర్శలను ఎదుగుదలకోసం ఉపయోగించుకోండి. అలా ఎదుగుతున్న టైమ్ లో మీమ్మల్ని అభిమానించే వారిని చూసి ఆనందించండి.. ఇక మీ జివితంలో ఎవరు విలన్లు గా ఉండాలి అనుకుంటారో.. వారిని కమెడియన్లుగా చూడండి.. అంటూ హితబోధ చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్
Kangana Ranaut
అ కామెంట్లకు కొదరు శభాష్ అంటూ కొంత మంది.. చాలా బాగా చెప్పావ్ కంగనా అంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. కంగనా కామెంట్ల కోసం ఆడియన్స్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. బాలీవుడ్ లో ఏదైనా సంఘటన జరిగితే అందరూ ఈ స్టార్ బ్యూటీ వైపే చూస్తారు.. ఆమె ఏమంటుందా అని.
వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఈమధ్య జోరు తగ్గించింది. ఎక్కువగా పొలిటికల్ ఇష్యూస్ మీద స్పందిస్తుంది. అంతే కాదు కంగనాకు పద్మశ్రీ రావడంపై కూడా ఎన్నో విమర్షలు ఆమె పేస్ చేసింది. మొత్తానికి కంగనా తన మార్క్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది.