23 కోట్ల వాచ్ కొన్న స్టార్ హీరో, షాక్ అవుతున్న ఇండస్ట్రీ ఎవరా హీరో..?
స్టార్ హీరోలు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. వారు వాడే వస్తువులు కూడా వారి రేంజ్ కు తగ్గట్టుగానే ఉంటాయి. ఒకరికి మించి మరొకరు తమ స్టేటస్ కు తగ్గట్టు అంతకు మించి మెయింటేన్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో వాచ్ కోసం 23 కోట్లు ఖర్చు పెట్టాడట. ఇంతకీ ఎవరా హీరో.

టాలీవుడ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు వాడే వస్తువులపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సోషల్ మీడియా జనాలు. ఈమధ్య సెలబ్రిటీల ఫ్యాషన్స్ పై నెటిజన్లకు ఇంట్రెసట్ పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ తారలు ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర్నుంచి వాచ్, షూస్, గ్లాసెస్ ఇలా అన్నింటి గురించి, వాటి ధరల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా.. ప్రభాస్ కార్లు.., మహేష్ బాబు షర్ట్స్.., ఎన్టీఆర్ వాచ్ లు.. అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి, వాటి కాస్ట్ గురించి సోషల్ మీడియాలో హడావిడి జరుగుతూనే ఉంది.
తాజాగా మరో స్టార్ హీరో పెట్టుకున్న వాచ్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అది అంటాంటి ఇట్టాంటి వాచ్ కాదు. కాస్ట్ తెలిస్తే నిజంగా కళ్ళు తిరుగతాయి. ఎవరూ ఊహించని .. ఇంత వరకూ ఏ సినిమా స్టార్ పెట్టనంత కాస్ట్ ఆ వాచ్ కోసం పెట్టారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. సల్మాన్ ఖాన్. ఆయన కొన్న వాచ్ చాలా స్పెషల్. ఆ వాచ్ కోసం ఆయన 23 కోట్లు పెట్టారట. టూమచ్ కదా..?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ హీరో అయినప్పటికీ.. ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది సల్మాన్ కు. . వెండితెపై సినిమాలు.. బుల్లితెరపై బిగ్ బాస్ లాంటి షోతో కూడా ఆయన సత్తాచాటుతున్నాడు. టెలివిజన్ రంగంలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ కి హూస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.
సినిమాలు, టెలివిజన్ తో పాటు కాంట్రవర్సీలు.. లతో సహవాసం చేస్తుంటారు సల్మాన్. ఆయనను చంపేస్తామని ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ లాంటి వారు పబ్లిక్ గా ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి వై కేటగిరి భద్రతతో పాటు.. సల్మాన్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నారు. సల్మాన్ ఖాన్ ఏది చేసినా సెన్సేషన్ గా ఉంటుంది. ఆయన రెమ్యూనరేషన్ కూడా కోట్లలో ఉంటుంది. అంతే కాదు ఆయన లైఫ్ కూడా లగ్జరీగా ఉంటుంది.
పలు యాడ్స్, ఎండార్స్ మెంట్స్ రూపంలో కోట్లు సంపాదిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాచ్‌లర్ గా ఉంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఓ వజ్రాల వాచ్ ధరించి ఫోటోకి పోజిచ్చారు. ఆ ఫోటోలో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ లు ధరించడం కొత్తేమీ కాదు. కానీ గతంలో ఆయన ధరించిన వాచ్ లో పోల్చితే ఈ వాచ్ చాలా స్పెషల్ అంటున్నారు.
సల్మాన్ ఖాన్ ధరించిన వాచీ ధర అక్షరాల రూ.23 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అది పాటెక్ ఫిలిప్ రెయిన్ బో కంపెనీకి చెందిన వాచ్ అని టాక్ వినిపిస్తుంది. ఈ వాచ్ లో దాదాపు 130 వజ్రాలు పొదిగి ఉన్నాయట. ప్రస్తుతం ఈ వాచ్ ధర గురించి నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ -3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.