MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముంబయ్ లో కాస్ట్లీ ఇల్లు కొన్న మహేష్ బాబు హీరోయిన్, ఇంటికోసం ప్రీతి జింటా ఎన్ని కోట్లుపెట్టిదంటే..?

ముంబయ్ లో కాస్ట్లీ ఇల్లు కొన్న మహేష్ బాబు హీరోయిన్, ఇంటికోసం ప్రీతి జింటా ఎన్ని కోట్లుపెట్టిదంటే..?

ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ కొత్త ఇల్లులు ఎక్కువగా కొనేస్తున్నారు. యంగ్ స్టార్స్... సీనియర్ స్టార్స్ చాలా మంది కోట్లకు కోట్లు కుమ్మరించి కొత్తగా ఇళ్ళు కొనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతీ జింటా కూడా కోట్లు పెట్టి..కొత్తిల్లుకొనిందట...? 

Mahesh Jujjuri | Published : Oct 27 2023, 11:32 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Preity Zinta

Preity Zinta

ఈమధ్య బాలీవుడ్ స్టార్లు కొత్త కొత్తగా ఇళ్ళు కొనుకుంటూ....వార్తల్లోకి ఎక్కుతున్నారు. అది కూడా కోట్లుకుమ్మరించి.. ముంబయ్ లోని కాస్ట్లీ ఏరియాల్లో సొంతిళ్లు కొనుకుంటున్నారు.  ఇప్పటికే జాన్వీకపూర్ లాంటి తారులు సొంత ప్లాప్లు కొనుకోగా.. తాజాగా ఆ లిస్ట్ లోకి ప్రీతీ జింటా చేరింది. 

27
Child Actress

Child Actress

బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన మెరిసిన బ్యూటీ... ప్రీతీ జింటా. టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇక్కడ కూడా మంచి ఇమేజ్ సాధించింది ప్రీతీ. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రీతి జింటా. రాజకుమారుడు సినిమాతో తెరంగేట్రం చేసిన.. ఆ తర్వాత ప్రేమంటే ఇదేరా సినిమాతో హిట్ అందుకుంది. 
 

37
preity zinta

preity zinta

తెలుగు, అటు హిందీలో  చాలాసినిమాలు చేసిన  ప్రీతి జింటా చివరిసారిగా 2018లో భయ్యాజీ అనే సినిమాలో కనిపించింది. ఇక  2016 లో వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్‌తో ఏడడుగులు వేసిన బ్యూటీ.. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. వీరికి 2021లో కవలలు గియా, జైల జన్మించారు. 
 

47
Asianet Image

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉండే ప్రీతి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ హీరోయిన్  17.01 కోట్లతో కొత్త అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసినందట.ప్రీతీ అమెరికానుంచి వచ్చి.. ముంబయ్ లో సెటిల్ అవ్వబోతుంది అని టాక్ నడుస్తుంది. అందుకే ముంబయ్ లో కాస్ట్లీ ప్లాన్ ను కొనుకోలు చేసిందట. 

57
Asianet Image

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం... ముంబైలోని కాస్ట్లీ ఏరియాల్లో ఒకటైన  బాంద్రాలో.. పాలి హిల్ ప్రాంతంలోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందట ప్రీతి. గతంలో ఆమె నివాసం ఉండే భవనంలోనే ఈ భవనం ఉన్నట్లు సమాచారం. ఈ అందమైన  అపార్ట్‌మెంట్ 1,474 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉందట. అంతే కాదు ఈ ప్లాట్ కోసం..  స్టాంప్ డ్యూటీ కింద  85.07 లక్షలు చెల్లించిందని తెలుస్తోంది.

67
Asianet Image

పెళ్ళి తర్వాత భర్త, పిల్లలతో కలిసి లాస్ ఏంజిల్స్ లో నివసిస్తోన్న ప్రీతి ఇప్పుడు మళ్లీ ముంబైలో ఆస్తులు కొనుగోలు చేయడంతో.. ఆమె ఇక్కడికి రావడం ఖాయం అంటున్నారు. ఇండియాలోనే స్థిరపడాలని.. ఆమె ఆస్తులు కొన్నట్టు చెపుతున్నారు. ఇక ప్రీతీ కొనుగోలు చేసిన ప్లాప్స్ లో.. బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఇల్లు కలిగి ఉన్నారు. అజయ్ దేవగన్, కాజోల్, ఇతర బాలీవుడ్ సెలబ్రెటీలు ఇక్కడ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. 

77
Asianet Image

ముంబై బాంద్రాలోని పాలి హిట్-ఓషివారాలోని సిగ్నేచర్ భవనం ప్రత్యేకంగా పలువురు ప్రముఖులను ఆకర్షించింది. ఇప్పటికే అక్కడ ఒక ఆస్తిలో నటుుడు మనోజ్ బాజ్ పేయి 31 కోట్లు పెట్టుబడి పెట్టారు. సెప్టెంబర్ లో అమితాబ్ బచ్చన్ ఓషివారాలోని ఓ వాణిజ్య ప్రాజెక్టులో దాదాపు 8.400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు కార్యాలయ స్థలాలను దాదాపు 29 కోట్లకు కొనుగోలుచేశారు. ఇప్పుడు ప్రీతి సైతం అమితాబ్ ఇంటి పక్కనే ఈ అపార్ట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బాలీవుడ్
 
Recommended Stories
Top Stories