అందాల అమీ జాక్సన్ నుంచి సాహో బ్యూటీ వరకు.. అందుకే RRR ని రిజెక్ట్ చేశారా ?
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ల విషయంలో ఓ ఆసక్తిగా ప్రచారం వైరల్ గా మారింది.

RRR Movie
దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో వెండితెరకి వేడెక్కిస్తున్నారు.
RRR Movie
కళ్ళు చెదిరే పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా అలియా భట్ క్యామియో తరహా రోల్ చేసింది. అలాగే ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించింది. కానీ వీళ్ళకంటే ముందు జక్కన్న చాలా మంది హీరోయిన్లని సంప్రదించారట. పలు కారణాల వల్ల వాళ్ళు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
RRR Movie
తన గ్లామర్ పిక్స్ తో ఇంస్టాగ్రామ్లో ఎక్స్ పోజింగ్ కి కొత్త నిర్వచనం చెబుతు పరిణీతి చోప్రాని సీత పాత్ర కోసం సంప్రదించారట. పాత్ర నిడివి, ఇతర కారణాల వల్ల పరిణీతి ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే సాహో బ్యూటీ శ్రద్దా కపూర్ ని కూడా సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. డేట్స్ అడ్జెస్ట్ కావడంతో ఆమె కూడా ఈ ఆఫర్ వదులుకుందట.
RRR Movie
ఇక ఎన్టీఆర్ హీరోయిన్ రోల్ కోసం మొదట రాజమౌళి 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అదే టైంకి అమీ జాక్సన్ ప్రెగ్నెంట్ కావడంతో ఆర్ఆర్ఆర్ చిత్రంలో జెన్నీ రోల్ వదులుకుంది.
RRR Movie
ఇక ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో ఎదుగుతున్న డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని జెన్నీ రోల్ కోసం ఎంపిక చేశారు. షూటింగ్ షురూ అయ్యే సమయానికి ఆమె తన పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుంది. దీనితో చివరకు ఆ ఆఫర్స్ ఒలీవియా మోరిస్, అలియా భట్ బుట్టలో పడ్డాయి.
RRR Movie
అలియా భట్ పాత్ర నిడివి చాలా తక్కువ అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీత పాత్ర నిడివి విషయంలో అలియా కూడా రాజమౌళి పై గుర్రుగా ఉన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. రాంచరణ్ తో ఒక సాంగ్ ని, కొన్ని సన్నివేశాలని రాజమౌళి ఎడిటింగ్ లో లేపేశారట. ఆల్రెడీ సినిమా 3 గంటల నిడివి దాటి పోవడంతో తప్పలేదు అని అంటున్నారు.