కర్రపట్టుకుని నడుస్తోన్న కాజోల్.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఇంతకీ ఆమెకు ఏమయ్యింది...?
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కు ఏమయ్యింది. తాజాగా ఆమె కుంటుతూ నడుస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో ప్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

బాలీవుడ్ లో నిషాకళ్ల సుందరిగా పేరు తెచ్చుకుంది.. షారుఖ్ తో కలిసి ఆమె చేసిన సినిమాలు అబ్బో.. ఫ్యాన్స్ విరగబడి చూసేవారు. అటు బాలీవుడ్ లోనే కాదు.. ఇటు సౌత్ లో కూడా కాజోల్ కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆమె హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయినా.. లీడ్ రోల్స్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు రూటు మార్చేసింది బ్యూటీ.
ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ సినిమాలు కాస్త పక్కన పెట్టి... ప్రస్తుతం వెబ్ సీరీస్ ల పై ఫోకస్ పెట్టింది. ది ట్రయల్ అనే వెబ్ సీరీస్ లో నటిస్తుంది.. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో లాయర్ నోయోనికాసేన్ గుప్తా అనే పాత్రలో నటించింది.
అమెరికన్ వెబ్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు హిందీ రీమేక్ గా ది ట్రయల్ రూపోందింది. ఇండియన్ వెర్షన్ కు తగ్గట్టు మార్పులు చేసి దీన్ని తెరకెక్కించారు. ఈ సిరీస్ లో భర్త చేతిలో మోసపోయిన ఓ లాయర్ తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొంది అనే కథతో ఈ వెబ్ సీరీస్ ఈ సిరీస రూపొందింది.
ఈ సిరీస్ తో కాజోల్ కు బాగా పేరు వచ్చింది. వరుసగా వెబ్ ఆఫర్లు కూడా వచ్చేస్తున్నాయట. ఇక పోతే.. తాజాగా కాజోల్ ను చూసిన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆమె కుంటుతూ.. ఓ చేతి కర్రతో నడవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు ఏమయ్యింది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఎక్కడికో వెళ్తూ.. ఆమె చేతి కర్ర సహాయంతో నడిచి వెళ్లి కారు ఎక్కింది. సాధారణంగా సెలబ్రిటీ ఇళ్ళముందు ఫ్యాన్స్.. కెమెరా మెన్ లు.. మీడియా ఉంటారు. ఆమె అలా నడవడం ఎవరో వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది.
ఆ కారణం చేతనే ఆమె మోచేతికి కర్ర మెల్లిగా తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఈ విషయంపై ఈ విషయంపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ వీడియో వైరల్ అయ్యింది కదా.. ఇప్పుడైనా ప్రకటన చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం కాజోల్ మిస్టిరీ థ్రిల్లర్ మూవీ దో పట్టీ లో నటిస్తుంది. ఇది కూడా ఓటీటీ రిలీజ్ కు వెళ్తుండగా.. ఈ మూవీలో కాజోల్ తో పాటు కృతి సనన్‌తో కలిసి నటించనుంది.