బాలీవుడ్ బ్యూటీపై ‘లైగర్’ దెబ్బ.. షాకింగ్ డిసిషన్ తీసుకున్న అనన్య పాండే!
‘లైగర్’తో సౌత్ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey). బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ పరాజయం కావడంతో ఆ ప్రభావం అనన్య పాండేపైనా పడిందనని తెలుస్తోంది. ఈ మేరకు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా సౌత్ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన స్టోర్స్ డ్రామా ‘లైగర్’(Liger). విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించిన విషయం తెలిసిదే.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ ను భారీగా నిర్వహించడంతో సినిమాపై హైప్ పెరిగింది. కానీ థియేటర్లలోకి వచ్చాక సినిమా అందరినీ నిరాశపరిచింది.
ఫస్ట్ డే నుంచే డిజాస్టర్ టాక్ తో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఫలితంగా మేకర్స్ కు నష్ట భారం తప్పలేదు. ఇప్పటికీ పూరీ జగన్నాథ్ పూడ్చే పనిలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే లైగర్ దెబ్బ అనన్య పాండే మీద కూడా పడింది.
లైగర్ తో సౌత్ ఇండస్ట్రీలోనూ అనన్య పాండే దూసుకెళ్లబోతోందని అంతా భావించారు. కనీసం ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోయిందీ బ్యూటీ. ఫలితం అనన్యకు బాలీవుడ్ లోనూ ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. దీంతో అనన్య షాకింగ్ డిసిషనల్ తీసుకున్నట్టు నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఆఫర్స్ లేకపోవడంతో తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. సినిమాకు దాదాపు కోటీ వరకు తీసుకునే ఈ బ్యూటీ.. ప్రస్తుతం రూ. 50 లక్షలే తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు ప్రచారం జ.రుగుతోంది. ఇప్పటికైనా అవకాశాలు అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.