ఆలియా భట్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత..? ఆ డబ్బుతో ఏం చేసిందో తెలుసా..?
బాలీవుడ్ యంగ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత..? ఆరెమ్యూనరేషన్ తో ఆమె ఏం చేసింది.. ? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. ఇక ఈ డీటేయిల్స్ ను రీసెంట్ గా రివిల్ చేసింది బాలీవుడ్ బ్యూటీ.

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది ఆలియా భట్. మహేష్ భట్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. ఆమె ఓన్ టాలెంట్ తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆలియాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ఈ పదేళ్ళలోనే సాధించింది చిన్నది.
2012 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ గుమ్మంతొక్కింది ఆలియా భట్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. వరుస సినిమాలు.. వరుస హిట్లతో దూసుకుపోతోంది. 19 ఏళ్లకే సినిమాల్లో వచ్చిన ఆలియా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి తాజాగా రివిల్ చేసింది.
ఆలియా భట్ తన ఫస్ట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకి తీసుకున్న పారితోషికం చాలా తక్కువని చెప్పింది. ఫస్ట్ మూవీకి గానూ 15 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుందట చిన్నది. అయితే ఆ రెమ్యూనరేషన్ కు చెందిన చెక్ కు ఆమె తీసుకెళ్లి నేరుగా తన తల్లి సోని రజ్దాన్ ఇచ్చినట్లు చెప్పింది. అంతే కాదు తన తొలి సంపాదనతో కారు కొన్నట్లు ఆమె పేర్కొంది.
ఇక రీసెంట్ గా తన ప్రేమికుడు.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడిన ఆలియా త్వరలోనే తల్లి కాబోతోంది.వీరు ఇద్దరు కలిసి నటించిన బ్రహ్మస్త్రం మూవీ త్వరలోరిలీజ్ కాబోతోంది. ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్స్.ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా పాల్గోన్న ఇంటర్వ్యూలోనే తన రెమ్మునరేషన్ ఎంతో బయటపెట్టింది ఆలియా.
అయితే ఇప్పటికీ తన రెమ్యూనరేష, డేట్స్ కు సంబంధించిన విషయాలన్నీ తన తల్లే చూసుకుంటుందట. చిత్రం ఏంటంటే తన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో కూడా తాను ఎప్పుడూ చూసుకోను అంటోంది ఆలియా భట్. అయితే అది ఎక్కువగానే ఉంటుంది అనే విషయం మాత్రం తనకు తెలుసు అంటోంది.
alia bhatt pregnancy care
19 ఏళ్ళకు తొలి రెమ్యూనరేషన్ తీసుకున్ ఆలియా భట్.. 22 ఏళ్ల వయస్సులో ఒక ఇంటిని కొన్నారు. అంతే కాదు ఇక నుంచి తన డేట్స్ తో పాటు ఆర్థిక లావాదేవీలను తానే చూసుకోబోతున్నట్టు తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. తను తల్లి కాబోతుంది.. కనకు బాధ్యతలు తనకు తెలియాలి అంటై...తన విషయాలు తానే చూసుకోవాలి అనే అభిప్రాయానికి వచ్చిందట స్టార్ బ్యూటీ.