మహేశ్ - త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ హీరో.. మరోసారి అదే ఇంట్రెస్టింగ్ బజ్!
దర్శకుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. ఇదిలా ఉంటే సినిమాపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

చాలా నెలల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ‘ఎస్ఎస్ఎంబీ28’తో సెట్స్ లో అడుగుపెట్టారు.
చివరిగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’తో అలరించిన మహేశ్ త్రివిక్రమ్ దర్శకత్వంతో నటిస్తున్న విషయం తెలిసిందే.
గతేడాది మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయగా.. ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ మీదికి వెళ్లింది. కానీ, వరుస మహేశ్ బాబు ఇంట విషాదాలు నెలకొనడంతో బ్రేక్ అవుతూ వస్తోంది. తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణ మరణంతో మహేశ్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో త్రివిక్రమ్ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోను ఎంపిక చేసే పనిలో ఉన్నారంట. ఇప్పటికే బాలీవుడ్ స్టార్, నిర్మాత అర్జున్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. కానీ వాటిని కొట్టిపారేశారు.
మరో నెల రోజుల తర్వాతే SSMB28 నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ చాలా ప్రత్యేక తెరకెక్కిస్తున్నారు. బలమైన కథను రెడీ చేయగా.. అందుకు తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా మరో బాలీవుడ్ నటుడు పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ (Viccky Kaushal)ను ఓ కీలక పాత్రకు ఎంపిక చేసే పనిలో ఉన్నారంట. మూవీలో పవర్ ఫుల్ రోల్ కు తనైతే సరిపోతాడని భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇందులో ఎంతవరకు నిజమున్నదనేది తెలియాల్సి ఉంది.
మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో పదకొండేండ్ల తర్వాత మళ్లీ సినిమా సెట్ అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరూ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. దీంతో ‘ఎస్ఎస్ఎంబీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రంలో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.