- Home
- Entertainment
- క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన మల్లిక, బాలీవుడ్ పెద్దల్లో వణుకు... అర్థరాత్రి ఫోన్లు చేసి రమ్మనేవారంటూ
క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన మల్లిక, బాలీవుడ్ పెద్దల్లో వణుకు... అర్థరాత్రి ఫోన్లు చేసి రమ్మనేవారంటూ
బాలీవుడ్ హాట్ బాంబ్ మల్లికా శెరావత్ క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె ఎవరి పేర్లు బయటపెడతారోనని కొందరు పరిశ్రమ ప్రముఖుల్లో వణుకు మొదలైంది. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు అంటూ మల్లికా షాకింగ్ విషయాలు వెల్లడించారు.

Mallika Sherawat
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన ప్రతి అమ్మాయికి ఏదో ఒక దశలో ఈ వేధింపులు ఎదురవుతాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోల నుండి ఎదురయ్యే ఈ లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఎవరూ సాహసం చేయరు. అలా చేస్తే తమ కెరీర్ అంతటితో ముగుస్తుందని భయపడతారు.
Mallika Sherawat
కొందరు మాత్రం లౌక్యంగా ఉన్న మాట వాస్తవమే.. కానీ మాకు ఎదురుకాలేదని తెలివైన సమాధానాలు చెబుతూ ఉంటారు. నేమ్ ఫేమ్ వచ్చే వరకు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుర్రాళ్ల కలల రాణిగా దశాబ్దానికి పైగా బాలీవుడ్ ని ఏలిన మల్లికా శెరావత్(Mallika Sherawat) కి కూడా ఈ వేధింపులు తప్పలేదట.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను అనుభవించిన లైంగిక వేధింపుల గురించి వివరించారు. పరిశ్రమలో ఓ వర్గం లైంగికంగా వేధించారు అన్నారు. కమిట్మెంట్స్ ఇస్తేనే సినిమా అవకాశాలు ఇస్తామని భయపెట్టారు. వాళ్ళ కోరికలు తీర్చడం కుదరదు అన్నందుకు తమన్ సినిమాల నుండి తీసేశారు. దర్శక నిర్మాతలు ఆఫర్ ఇచ్చాక కూడా హీరోకి కమిట్మెంట్ ఇవ్వలేదని చాలా అవకాశాలు కోల్పోయానని మల్లికా శెరావత్ తెలియజేశారు.
దర్శకులు, నిర్మాతలు, హీరోలు అర్థరాత్రి ఫోన్లు చేసి రమ్మనేవారని అలాంటి భయానక సంఘటనలు మల్లికా శెరావత్ గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఈ స్థాయిలో ఉందో మల్లికా శెరావత్ కామెంట్స్ తెలియజేస్తున్నాయి. బాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ మీ టూ ఉద్యమంలో పాల్గొన్నారు. కొందరు పరిశ్రమ ప్రముఖులపై ఆరోపణలు చేశారు.
Actress Mallika sherawat
ఇక మల్లికా శెరావత్ కెరీర్ పరిశీలిస్తే... జీనా సిర్ఫ్ మేరే లియే మూవీతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. రెండో చిత్రం క్వహిష్ ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ మూవీలో ఆమె బోల్డ్ గా కనిపించారు. ఆ ఇమేజ్ తో మల్లికా వరుస ఆఫర్స్ దక్కించుకున్నారు. మర్డర్, హిస్ చిత్రాల్లో మల్లికా మరింత బోల్డ్ రోల్స్ చేశారు. జాకీ చాన్ నటించిన ది మిత్ చిత్రంలో నటించారు.
<p style="text-align: justify;">2002లో వచ్చిన జీనా హై సిర్ఫ్ మేరేలియే చిత్రంతో వెండితెరకు పరిచయమైన మల్లిక, కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేసింది. 2003లో వచ్చిన క్వాహిష్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న మల్లికా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. </p>
2012 తర్వాత మల్లికా కెరీర్ నెమ్మదించింది. 2015 వరకు ఆమె వెండితెరపై కనిపించలేదు. 2019లో విడుదలైన బూ సబ్ కి పతేగి వెబ్ సిరీస్లో నటించిన మల్లికా... 2022లో విడుదలైన ఆర్కే/ఆర్కే చిత్రంలో నటించారు. కెరీర్ పరంగా మల్లికా శకం ముగిసినట్లే అని చెప్పాలి.