- Home
- Entertainment
- Janhvi Kapoor Latest Photos : రెడ్ డ్రెస్ లో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్..
Janhvi Kapoor Latest Photos : రెడ్ డ్రెస్ లో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్..
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అటు సినిమాలతో అలరిస్తూ... ఇటు నెట్టింటా గ్లామర్ షోతో అభిమానులను కట్టిపడేస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మైమరిపిస్తున్నాయి.

దివికెగిసిన గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి (Sri Devi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎంత దగ్గరగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ స్టాలో తను చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు.
దాదాపు 16 మిలియన్ల ఫాలోవర్స్ తో ఈ సుందరి బిగ్ ఇన్ స్టా ఫ్యామిలీని రన్ చేస్తోంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నెట్టింట తను ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారుతోంది. తొలిచూపులోనే ఆకర్షించే ఫిట్ నెస్, గ్లామర్ జాన్వీ కపూర్ సొంతం కావడం విశేషం.
ఇటీవల ధర్మ ప్రొడక్షన్ సీఈవో అపూర్వ మెహతా బర్త్ డే బాష్ లో జాన్వీ కపూర్ మెరిసింది. బర్త్ డే పార్టీలో జాన్వీ ధరించిన అవుట్ ఫిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పటికే అందంతో మత్తెక్కించే జాన్వీ.. యానిమల్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్ లో తన ఫిట్ నెస్ అందాలతో పిచ్చెక్కించింది. ఇది మరువక ముందే మళ్లీ కొత్త అవుట్ పిట్ లో దర్శనమిచ్చింది.
వెడ్డింగ్ సీజన్ సందర్భంగా ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ వీక్ 2022 లో జాన్వీ కపూర్ లాక్మే తరుఫున ట్రెడిషినల్ వేర్ లో వేదికపై నడిచింది. యేటా రెండు సార్లు ఈ ఫ్యాషన్ వీక్ ను ముంబయిలో నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా తగిన బహుమతులు కూడా దక్కుతాయి.
అయితే, ఈ కార్యక్రమానికి హాజరైన జాన్వీ కపూర్ రెడ్ స్లీవ్ టెస్ జాకెట్, మ్యాచింగ్ లెహంగాలో అందరికీ ద్రుష్టిని ఆకర్షించింది. ఈ అవుట్ ఫిట్ లో జాన్వీ బ్యూటీ రెండింతలైందని చెప్పొచ్చు. తాజాగా ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫొటోలకు కొద్దిక్షణాల్లోనే లక్షల్లో లైక్స్ వచ్చాయి.
కేరీర్ విషయానికొస్తే.. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా పాపులర్ అవుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ వచ్చిన అవకాశాలను మాత్రం వదులు కోవడం లేదు.
బాలీవుడ్ లో ప్రస్తుతం ‘దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిలీ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే గుడ్ లక్ జెర్రీ, మిలీ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపైనా చాలానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కొద్ది రోజుల కింద బోణీ కపూర్ Boney Kapoor వాటిని కొట్టి పారేశారు. అయినా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ పక్కా అంటూ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.