- Home
- Entertainment
- చీరకట్టులో సూడ సక్కగా ప్రభాస్ బ్యూటీ జాక్వెలిన్.. సూపర్ పోజులతో అట్రాక్ట్ చేస్తున్నబాలీవుడ్ భామా
చీరకట్టులో సూడ సక్కగా ప్రభాస్ బ్యూటీ జాక్వెలిన్.. సూపర్ పోజులతో అట్రాక్ట్ చేస్తున్నబాలీవుడ్ భామా
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) చీరకట్టు అందాలతో మతిపోగొడుతోంది. నెట్ శారీలో బాలీవుడ్ బ్యూటీ సూడ సక్కగా కనిపిస్తోంది. తాజాగా మతిపోయే ఫోజులతో కూడిన తన ఫొటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గ్లామర్ రోల్స్ తోపాటు, పలు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ సుందరి రచ్చరచ్చ చేస్తోంది.
సినిమాల్లోనే తట్టుకోలేనంత గ్లామర్ ఒలకబోస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలోనూ గ్లామర్ తో రచ్చ చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ పిక్స్ ను పంచుకుంటూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ పిక్స్ లో ప్రభాస్ బ్యూటీ జాక్వెలిన్ చీరకట్టు అందాలతో మతిపోగొడుతోంది. నెట్ శారీలో నాభీ అందాలు చూపిస్తూ హోయలు పోయింది. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. వెస్ట్రన్ వేర్ లో కంటే జాక్వెలిన్ ట్రెడిషనల్ వేర్ లో చాలా అందంగా కనిపిస్తుందంటూ ఆమె అభిమానులు పొగుడుతున్నారు.
జాక్వెలిన్ తాజాగా దుబాయ్ లోని అబుదాబీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA2022) ఫంక్షన్ కు హాజరైంది. ఈ సందర్భంగా హెవీ డిజైన్డ్ నెట్ శారీలో దర్శనమిచ్చింది. చీరకట్టులో ఈవెంట్ కు హాజరైన వారందరి చూపును తనవైపు పడేలా చేసింది. గ్లామర్, ఫ్యాషన్ తో అవార్డ్స్ ఫంక్షన్ లో అట్రాక్షన్ గా నిలిచింది.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను 200 కోట్లకు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్‌తో.. జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఈడీ విచారణలో తేలగా.. ఆమె నుంచి రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకున్న విషయం తెలిసిందే. కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఆమె ఇండియా విడిచి వెళ్లకుండా కోర్టు నిషేధం విధించింది.
దీంతో అబుదాబిలో ఈ నెల 31 నుంచి జూన్ 6వ వరకు జరగనున్న IIFA ఫంక్షన్ లో పాల్గొనేందుకు జాక్వెలిన్ ఇటీవల కోర్టును ఆశ్రయించగా తాజాగా షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈవెంట్ కు వెళ్లాంటే రూ.50 లక్షల డిపాజిట్‌ను పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. జాక్వెలిన్ ఇటీవల బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో కలిసి ‘బచ్చన్ పాండే’ చిత్రంలో నటించింది. అలాగే ‘ఎటాక్’లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తో ‘విక్రాంత్ రోణ’లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘సర్కస్ మరియు రామ్ సేతు’లో నటిస్తోంది.