అల్లూరికి జోడీగా అలియా.. బర్త్ డే స్పెషల్!

First Published 15, Mar 2019, 12:24 PM

సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. టాలెంట్ లేకపోతే ఎక్కువకాలం రాణించలేరు. 

సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. టాలెంట్ లేకపోతే ఎక్కువకాలం రాణించలేరు. చాలా తక్కువ మంది మాత్రమే వారసులుగా ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభ చాటుకున్నారు. వారిలో ఒకరు అలియాభట్. ఇప్పటివరకు బాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు 'RRR'తో టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఈరోజు అలియా పుట్టినరోజు సందర్భంగా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

ప్రముఖ నిర్మాత మహేష్ భట్ గారాల పట్టి అలియా. ఆమె తల్లి సోని కూడా సినిమా రంగానికి చెందిన వారే.

అలియాకి తనకంటే చిన్నదైన సోదరి ఉంది. ఆమె పేరు షహీన్. తన సోదరి అంటే అలియాకి చాలా ప్రేమ. సందర్భం వచ్చిన ప్రతీసారి ఆమెపై ప్రేమను వ్యక్తపరుస్తుంటుంది.

అలియా 'సంఘర్ష్' చిత్రంతో బాలనటిగా బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమాలో చిన్నప్పటి ప్రీతిజింతాగా కనిపించింది.

2012లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. నిర్మాత కూతురు అయినప్పటికీ ఈ సినిమా ఆడిషన్ లో 400 మంది అమ్మాయిలతో కలిసి సాధారణ యువతిగానే పాల్గొంది. కరణ్ జోహార్ హీరోయిన్ గా అలియాని ఎంపిక చేసుకున్నారు. అప్పటికి 67 కిలోలు ఉండే అలియా సినిమా కోసం 16 కిలోలు తగ్గింది.

అలియాకి ఫ్రెండ్స్ బ్యాచ్ లు ఎక్కువ. డిజైనర్ మసబా గుప్తాతో పాటు పలువురు అమ్మాయిలు కలిసి ఎక్కువగా తిరుగుతుంటారు. వీరికి 'స్పైస్ గర్ల్స్' అనే గ్యాంగ్ నేమ్ కూడా ఉంది.

అలియాకి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఎక్కువ. ఫిట్ గా ఉండడం కోసం ఎక్కువగా వాటర్ తాగుతుంటుంది. ఫ్రూట్స్, దోస, పాస్తా, కీర్ వంటి తిండి పదార్ధాలను ఇష్టంగా తింటుంది. ముఖ్యంగా తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం.

అలియా 'పెటా' ఆర్గనైజేషన్ కోసం పని చేస్తుంటుంది. ఒక యాడ్ లో కూడా నటించింది.

అలియాకి పెయింటింగ్ చేయడం చాలా ఇష్టం. ముఖ్యంగా చార్కోల్ తో పెయింటింగ్ వేయడానికి ఇష్టపడుతుంది.

పని లేనప్పుడు ఎక్కువ సమయం నిద్ర పోవడం ఇష్టపడుతుందట. నిద్ర తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెబుతుంటుంది.

అలియా పెంచుకునే పెట్ పేరు 'అలూ'

అలియా పెంచుకునే పెట్ పేరు 'అలూ'

కరీనా కపూర్ కి అలియా పెద్ద ఫ్యాన్. కాలేజ్ డేస్ లో ఎక్కువగా కరీనా కపూర్, ఐశ్వర్యారాయ్ లను అనుకరించేదట.

అలియాలో మంచి నటే కాదు.. సింగర్ కూడా ఉంది. 'హైవే' సినిమాలో మొదటిసారిగా ఆమె పాట పాడింది.

మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అలియా అబ్బాయిల పెర్ఫ్యూమ్ వాడుతుందట.

గతంలో ఓసారి హైదరాబాద్ వచ్చిన అలియా తెలుగులో ఎవరితో నటించాలనుందని అడిగితే ఎన్టీఆర్ పేరు చెప్పింది. తనకు ఎన్టీఆర్ గురించి వ్యక్తిగతంగా తెలియకపోయినా తన స్నేహితురాలి దగ్గర విన్నానని చెప్పింది.

ఈ ఏడాదిలో ఇప్పటికే 'గల్లీబాయ్' తో సక్సెస్ అందుకున్న అలియా తెలుగులో రాజమౌళి 'RRR' లో నటించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఆమె చరణ్(అల్లూరి సీతారామరాజు పాత్ర) కి జోడీగా సీత పాత్రలో కనిపించనుంది.