ఫోటో స్టోరి: బికినీలో కుమ్మి పడేసిన 'ఐస్ క్రీమ్' గాళ్
మహేష్ బాబు హీరోగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అరంగేట్రం చేసిన తేజస్వి మదివాడ..ఆ తర్వాత ఐస్ క్రీమ్, అనుక్షణం, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, శ్రీమంతుడు, పండగచేస్కో, కేరింత, రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లో కనిపించింది. కానీ ఏ సినిమా కూడా ఆమెకు సరైన బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ లోనూ కనిపించిన ఆమె ఇదిగో ఇలా అప్పుడప్పుడూ హాట్ ఫొటోలతో ..నెట్టింట్లో కుర్రకారుకు సెగలు పుట్టించే హాట్ ఫొటోలను షేర్ చేసే పోగ్రామ్ పెట్టుకుంది. సినిమాలో ఆఫర్స్ కోసమో లేక తన అందాలను గుర్తించండి అని చెప్పటం కోసమో ఈ తెలుగు అమ్మాయి తెగ తాపత్రయపడుతోంది. అసలు ఈ ఫొటోలు చూస్తే తెలుగు అమ్మాయి అంటే ఎవరూ నమ్మరు. మీరూ ఆమె తాజా ఇనిస్ట్ర ఫొటోలపై ఓ లుక్కేయండి...
బిగ్ బాస్ తెలుగు సీజన్లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది.
అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. బ్రేక్ కోసం ఎంత తాపత్రయ పడినా ఆమె బి గ్రేడ్ సినిమా ఆఫర్సే తప్ప సరైనవి పడటం లేదు.
ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్లు చేస్తూ కేక పెట్టిస్తోంది. ఆ ఫొటోలు మరి దర్శక,నిర్మాతల కళ్లల్లో పడుతున్నాయో లేదో చూడాలి.
‘ఐస్‌క్రీమ్’ సినిమాతో ఆడియన్స్ హృదయాలను నైస్‌గా కొల్లగొట్టిన భామ తేజస్వి మదివాడ. తానుపుట్టి పెరిగిన హైదరాబాద్‌లో చాలా అనుబంధం ఉందంటుంది.
మాది విజయవాడ. అయితే నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. బాల్యమంతా బీహెచ్ఈఎల్, బేగంపేట, సైనిక్‌పురి ప్రాంతాల్లోనే గడిచింది.
జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఎనిమిది వరకు, బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయలో టెన్త్ వరకు చదివా.
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. పీజీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలి టజం చేశా. ఓ టీవీ చానల్లో ఇంటర్నెషిప్ చేశా.
నేను ఆరేళ్ల ప్రాయంలో ఉండగా అమ్మ లక్ష్మి చనిపోయింది.అప్పటి నుంచి సిటీలో చిన్నప్పుడు అమ్మతో కలిసి తిరిగిన ప్రాంతాల ఫొటోలు తిరిగేస్తూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటుంటాను.
సీఐఎస్ఎఫ్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నాన్న ఎన్కే రావు అన్ని విషయాల్లో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అన్న హరీశ్ యానిమేటర్.
స్కూలింగ్ నుంచే డ్యాన్స్ అంటే నాకు మహా ఇష్టం. స్కూల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వేదికెక్కి స్టెప్పులేసేదాన్ని.
అలా బాబాసెహగల్ చికాగో అకాడమీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశా. ఇదే సమయంలో నాకు సెవన్అప్ యాడ్ అవకాశం వచ్చింది.
2011లో హైదరాబాద్‌లో జరిగిన ‘మిస్ దాబర్ గులబరి’ అందాల పోటీల్లో పాల్గొన్నా. క్యాట్, ర్యాంప్వాక్లతో పాటు డ్యాన్స్ కూడా చేశా.
అయితే రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడే నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత చెల్లెలిగా నటించే చాన్స్ వచ్చింది. హార్ట్ఎటాక్, మనం, అనుక్షణం, లవర్స్ సినిమాల చాన్స్‌లు తలుపుతట్టాయి.
రాంగోపాల్‌వర్మ డెరైక్షన్‌లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’లో పూర్తిస్థాయి హీరోయిన్గా చేశా. ప్రస్తుతం ఊర్వశివో...రాక్షసివో, పండగ చేస్కో, రాజు గారి గాడి సినిమాలు రిలీజ్‌కు అయ్యాయి.
తమిళ్ మూవీ హోలీలో నటించా. చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. అనుకోకుండానే అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం సినీ కెరీర్‌పైనే దృష్టి అంతా.
చార్మినార్ అంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచి అక్కడికి ఎన్నోసార్లు వెళ్లా. టైమ్ దొరికితే జూబ్లీహిల్స్‌లోని మహరాజ్ చాట్ భండార్‌లో వాలిపోవాల్సిందే.
బేగంపేటలోని నీడ్స్ దాబాలో డిఫరెంట్ స్పైసీ వంటకాల్ని టేస్ట్ చేస్తా. సిటీ సెంటర్ వెనక ఉండే ఓహ్రీస్, రుచి అండ్ ఇదోని బిస్ట్రోకు రెగ్యులర్‌గా వెళ్తుంటా.
అక్కడ చెఫ్ చేసే వంటకాలు టేబుల్‌పైకి రాగానే మొదలు కెమెరాతో క్లిక్ చేసిన తర్వాత ఆరగిస్తా. హోలీ వచ్చిందంటే ఫ్రెండ్స్‌తో కలిసి రంగుల్లో మునిగి తేలుతుంటా. నేను చిన్నప్పుడు చూసిన సిటీని మళ్లీ చూడాలనిపిస్తోంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా దర్శనమిచ్చిన తేజస్వి మదివాడ... ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో తన హాట్ అందాలతో కుర్రకారును ఎలా పిచ్చెక్కెంచిందో అందరికి తెలిసిందే.
ఐస్ క్రీమ్ సినిమా తర్వాత తేజస్వి మడివాడ దాదాపు 20 చిత్రాల వరకు చేసినప్పటికీ... అవేవీ ఆమెకు సరైన గుర్తింపుని అయితే ఇవ్వలేకపోయాయి.
తేజస్వి మడివాడ తరచుగా ఇస్తున్న ఫోటో షూట్స్ చూస్తోంటే.. మరిన్ని ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు, బోల్డ్ రోల్స్ చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని ఫిలిం మేకర్స్‌కి డైరెక్టుగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా ఉంటాయి.
ఐస్ క్రీమ్ సినిమా ఆమెకు ఇంకొన్ని సినిమాలు చేసే అవకాశాలు తెచ్చిపెట్టినప్పటికీ... అవేవీ ఆమెను పెద్దగా బిజీ చేయలేకపోయాయి. అందులోనూ చాలా చిత్రాల్లో ఆమె చేసింది అంతగా గుర్తింపు లేని పాత్రలే
అయితే హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయిన తేజస్వీకి వెండితెరపై ఓ మోస్తరు అవకాశాలే వచ్చాయని చెప్పవచ్చు.
'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ షో లో గ్లామర్ ఆటలు పాటలు కోపాలు ఇలా అన్ని ఎమోషన్స్ చూపిస్తూ 'బిగ్ బాస్'ని కూడా ఆకట్టుకుంది.
కాగా తేజస్వి ప్రస్తుతం 'కమిట్మెంట్' అనే సినిమాలో నటిస్తోంది. 'హైదరాబాద్ నవాబ్స్' 'పరిచయం' చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులతో పాటు పలు రంగాల్లో చోటుచేసుకొంటున్న వేధింపులను కథాంశంగా 'కమిట్మెంట్' రూపొందించారు.
''ఇండస్ట్రీలో డేట్ చేద్దాం అని అడిగే వారి కన్నా ఐస్ క్రీమ్ కావాలా అని అడిగేవారు ఎక్కువ. నా దృష్టిలో అదే కాస్టింగ్ కౌచ్.
టాలీవుడ్ లో చాలా మంది నన్ను కమిట్మెంట్ అడిగారు. వాటిని ఒప్పుకోలేక నేను సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను.
సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు ముందుగానే కమిట్మెంట్ కు ప్రిపేర్ అయి వస్తున్నారు. ఆ క్యాటగిరీలో మనం ఉంటే ముందుకు సాగుతాం. లేకపోతే నాలాగా ప్రతిభ ఉన్నా రేసులో వెనుకబడి పోతాం అని తేజస్వి మదివాడ చెప్పారు.
బాంబే హీరోయిన్స్ దేనికైనా ఒప్పుకొంటారనే ఏకైక కారణంతో వారిని తమ సినిమాల్లో పెట్టుకొంటున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చే వారంతా అలా ఉంటారనే కాదు.. కొంతమంది వల్లే ఇలాంటి చెడ్డపేరు తెలుగు హీరోయిన్లకు వస్తుంది.