అఖిల్, అభిజిత్ మధ్య మరోమారు వివాదం.. వరస్ట్ కెప్టెన్ అరియానా
First Published Nov 27, 2020, 10:30 PM IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 82వ రోజు ఇంటి సభ్యులకు బాగా క్లాస్ పీకాడు బిగ్‌బాస్. దెయ్యం ఎపిసోడ్‌లో టాస్క్ లు సరిగా పూర్తి చేయలేదని ఫైర్ అయ్యాడు. అంతేకాదు ఇక హౌజ్‌లో కెప్టెన్ లేకుండా హౌజ్ నడుస్తుందని పేర్కొన్నాడు. ఎప్పటిలాగే అభిజిత్, అఖిల్ మధ్య వార్ జరిగింది.

శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలో వ్యాయామంతో ప్రారంభమైంది. మోనాల్ యోగా చేస్తుంటే, అవినాష్ వచ్చి తాను చేస్తానని తెలిపాడు. వచ్చి సరిగా చేయలేకపోవడంతో సోహైల్ .. అవినాష్‌ని వత్తిడి చేసి మరీ యోగా ఆసనం వేయించాడు.

ఆ తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు క్లాస్ పీకాడు. దెయ్యం జలజ ఎపిసోడ్‌లో ఎవరూ సరిగా ప్రదర్శన ఇవ్వలేదని మండిపడ్డాడు. దీంతో అభిజిత్ వరస్ట్ ఫర్‌ఫెర్మెన్స్ గా చెప్పాడు. ఎక్కడ మిస్‌స్టేక్ జరిగిందో చెప్పాలన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?