ఇంటి సభ్యుల మధ్య కొట్లాట పెట్టిన నామినేషన్స్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ ఇంటిసభ్యుల మధ్య మంట పెట్టింది. గతంలో లేని విధంగా ఈ సారి సభ్యులు ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు.
బిగ్‌బాస్ నాల్గో సీజన్ నిన్న దసరా స్పెషల్ ఆద్యంతం సందడిగా, కలర్‌ఫుల్‌గా సాగింది. ఇక ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టారు. సోమవారం మోనాల్, అభిజిత్‌కి మధ్య తలెత్తిన విషయాలను నోయల్, అభిజిత్, లాస్య, హారిక మధ్య చర్చ జరిగింది. మోనాల్.. అభిజిత్‌తో మాట్లాడుకుందట. అందుకు నోయల్‌ని అడగ్గా తాను మాట్లాడమని చెప్పాడని అభిజిత్‌తో నోయల్ చెప్పాడు. మరోవైపు లాస్య స్పందిస్తూ, మోనాల్ అందరి దుప్పట్లు మడత పెడుతుందని, కానీ అభిజిత్‌వి మాత్రం వదిలేస్తుందని చెప్పింది. మా మధ్య ఏం లేదని, అంతా క్లీయర్‌గా ఉన్నామన్నారు.
ఇక ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎనిమిదో వారం నామినేషన్ల గతంలో లేని విధంగా చాలా హీటెక్కింది.
మొదట లాస్య.. అమ్మ రాజశేఖర్ ని, మోనాల్‌ని నామినేట్ చేసింది. అమ్మా రాజశేఖర్ వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ అని చెప్పింది. ఆ తర్వత అఖిల్.. అరియానా, అమ్మ రాజశేఖర్‌లను నామినేషన్ చేశారు. ఇందులో అరియానా ఆవేశం తగ్గించుకోవాలన్నారు. ఇక అమ్మ రాజశేఖర్ ప్రతి విషయంలో సింపతి వర్డ్ వాడుతున్నారు. అది నచ్చడం లేదన్నారు.
అమ్మా రాజశేఖర్.. అఖిల్,ఇ, లాస్యని నామినేట్ చేశారు. ముఖ్యంగా అఖిల్, అమ్మా రాజశేఖర్ మధ్య పెద్ద
గొడవే జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విరుకుపడ్డారు.
సింపతి విషయంలో అమ్మాని అఖిల్ నామినేషన్ చేయగా, అదే విషయంలో అఖిల్‌ని నామినేట్ చేశాడుఅమ్మా. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకనొక సమయంలో ఒరకిపైకి ఒకరు వెళ్ళారు. దీంతో అఖిల్‌ని ఇతర సభ్యులు నిలువరించారు.
అరియానా.. మెహబూబ్‌ని, అఖిల్‌ని నామినేట్ చేశారు. మెహబూబ్ తమ మధ్య ఉన్న విభేదాలను క్లీయర్ చేసుకోవాలన్నారు. కానీ ఇలా ఎలిమినేట్‌చేస్తే ఇక సమస్యలు ఎలా క్లీయర్ అవుతాయని మండిపడింది. ఇక సోహైల్ .. అరియానాని నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా అరియానా సీరియస్ గా చూసింది. దీంతో సోహైల్ భయపడ్డాడు. ఏదో ఒకటి మాట్లాడు అంటే మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. దీంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.
మోనాల్‌ని లాస్య, మెహమూబ్ నామినేషన్ చేశాను. అందుకు మోనాల్ లాస్య, మెహబూబ్‌లను నామినేట్ చేసింది. ఈ సందర్భంగా లాస్య తనకు ఫుడ్ విషయంలో చూపిన పార్షియాలిటీని చెప్పింది. అంతేకాదు ఇక తన గురించి ఓ షాకింగ్ కామెంట్ చేసింది. మరోసారి అఖిల్, అభిజిత్, మోనాల్ మధ్య జరిగే విషయాలను చర్చకు రావడంతో మోనాల్ బాధపడింది. దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని, ఇకపై ఎవరికి ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యింది.
ఇక ఫైనల్‌గా అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కి నామినేషన్ అయ్యారు.