- Home
- Entertainment
- కొడుకుతో బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ.. మైండ్ బ్లాక్ రియాక్షన్.. బాబోయ్ ఇలా కూడా ఉంటారా?
కొడుకుతో బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ.. మైండ్ బ్లాక్ రియాక్షన్.. బాబోయ్ ఇలా కూడా ఉంటారా?
ఇటీవల బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో మెరిసింది బిగ్‌బాస్ నటి రూపాలి గంగూలీ. కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. హాట్ టాపిక్ అవడంతో తాజాగా స్పందించింది రూపాలి.

థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్‌ని ప్రారంభించింది రూపాలి గంగూలీ. స్టార్ ప్లస్ సీరియళ్లతో నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌తో మంచి పేరుతెచ్చుకుంది. 2006లో బిగ్‌బాస్‌లో పాల్గొని హిందీ పరిశ్రమలో భారీగా ఫాలోయింగ్‌ని పెంచుకుంది.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచుకున్న రూపాలి.. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్లతో, గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది.
రూపాలి ఈ బుధవారం ఓ ఫొటోను షేర్ చేశారు. తన కొడుకు రుద్రాక్ష పుట్టిన రోజు సందర్భంగా భర్త అశ్విన్‌తో కలిసి లోనావాలకు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నారు. దీంతో బాలీవుడ్ మీడియా రూపాలి బికినీ ధరించిందంటూ వార్తలు ప్రసారం చేసింది.
`బికినీలో రూపాలి గంగూలీ చాలెంజ్` అంటూ వార్తలు రాశాయి. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించింది. `నా దగ్గర బికినీ ఉందని నాకే తెలియదు! నాకంటే నా గురించి మీకే ఎక్కువగా తెలుసు. రాంగ్ రిపోర్టింగ్` అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో అభిమానులు రూపాలికి మద్దతు పలుకుతుండగా, కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె తీరును విమర్శిస్తున్నారు. ఇలా కూడా ఉంటారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే అనుపమ సీరియల్‌లో లీడ్ రోల్ పోషించిన రూపాలి.. కుటుంబం కోసం తన ఆశలు, ఆశయాలు త్యాగం చేసి మంచి గృహిణిగా, తల్లిగా పేరు తెచ్చుకునే క్యారెక్టర్‌లో జీవించారు. ఎంతగా ఒదిగి ఉన్నా భర్త సంతృప్తి పొందకపోగా తనను పదే పదే విమర్శిస్తుండటంతో అస్థిత్వం కోసం ఎంతదాకానైనా వెళ్లేందుకు సిద్ధమంటూ ఆత్మాభిమానం చాటుకునే పాత్రలో మెప్పించి మంచి మార్కులు కొట్టేశారు.