MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యే వార్త.. అసలు బిగ్‌ బాస్‌ మారిపోయాడా? ఇంతకి ఆ వాయిస్‌ ఎవరిదో తెలుసా?

బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యే వార్త.. అసలు బిగ్‌ బాస్‌ మారిపోయాడా? ఇంతకి ఆ వాయిస్‌ ఎవరిదో తెలుసా?

బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి సంబంధించిన ఒక నిరాశ పరిచే వార్త బయటకు వచ్చింది. ఈ సారి బిగ్‌ బాస్‌ మారిపోయారట. ఆ వాయిస్‌ ఇచ్చే వ్యక్తిని మార్చేశారట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 25 2025, 10:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస `అగ్నిపరీక్ష`లో కామన్‌ మ్యాన్‌ కంటెస్టెంట్ల ఎంపిక
Image Credit : star maa promo

బిగ్‌ బాస `అగ్నిపరీక్ష`లో కామన్‌ మ్యాన్‌ కంటెస్టెంట్ల ఎంపిక

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. కానీ దానికంటే ముందే ఇప్పుడు `బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష` పేరుతో కామన్‌ మ్యాన్‌ కంటెస్టెంట్లని ఎంపిక చేస్తున్నారు. ఇందులో 45 మందిని ఫిల్టర్‌ చేసి, వారిలోనుంచి ఐదుగురుని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జియో హాట్‌ స్టార్‌లో ఈ బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష రన్‌ అవుతుంది. ఇందులో కామన్‌ మ్యాన్‌ కంటెస్టెంట్లని జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న నవదీప్‌, అభిజీత్‌, బిందుమాధవి కలిసి ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్‌ 5న ఇది ఫైనల్‌ కాబోతుంది.

DID YOU
KNOW
?
నాగార్జున హోస్ట్
బిగ్‌ బాస్‌ షోకి నాగార్జున రెండో సీజన్ నుంచి హోస్ట్ గా చేస్తున్నారు. ఆరు సీజన్లకి ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పదో సీజన్‌ కి కూడాఆయనే హోస్ట్ గా ఉండబోతున్నారు.
25
బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్షపై ట్రోల్స్
Image Credit : Star Maa

బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్షపై ట్రోల్స్

ప్రస్తుతం నడుస్తున్న `బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష`కి ఆడియెన్స్ నుంచి నెగటివ్‌ రియాక్షన్‌ వినిపిస్తోంది. ఏమాత్రం రసవత్తరంగా లేదని అంటున్నారు. చాలా వింతగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష ప్రారంభానికి ముందు చాలా హడావుడి జరిగింది. మామూలుగా ఉండదు, చాలా టఫ్‌గా ఉంటుందంటూ ప్రోమోల్లో నవదీప్‌, అభిజీత్‌ తెలిపారు. కానీ తీరా షో మాత్రం చప్పగా సాగుతుందంటున్నారు. అదే సమయంలో కామన్‌ మ్యాన్‌ అంటే యూట్యూబర్స్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వారిలో చాలా వరకు అలాంటి వాళ్లే కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్ల నుంచి విభిన్నమైన వాదన వినిపిస్తోంది.

Related Articles

Related image1
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి నటించిన తొలి సినిమా ఏంటో తెలుసా? రామారావు చేసిన పనికి అక్కినేని షాక్‌
Related image2
ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డాన్స్ కి ఇన్‌స్పైర్‌ అయి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి ఎవరో తెలుసా?
35
బిగ్‌ బాస్ మారిపోయాడా?
Image Credit : x/ JioHotstar Telugu

బిగ్‌ బాస్ మారిపోయాడా?

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ షోకి సంబంధించిన ఒక షాకింగ్‌ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సారి బిగ్‌ బాస్‌ మారిపోయాడనే కామెంట్‌ వినిపిస్తోంది. ఇటీవల బిగ్‌బాస్‌ ప్రోమోస్‌లో బిగ్‌ బాస్‌ గా కొత్త వాయిస్‌ వినిపించింది. గతంతో పోల్చితే కొత్త వ్యక్తి చెప్పినట్టుగా ఉంది. అదే సమయంలో వాయిస్‌లో గాంభీర్యం మిస్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ అన ఫీల్‌ రావడం లేదు. దీంతో ఇది ట్రోల్స్ కి గురయ్యింది. షోపై ఆసక్తి తగ్గిపోతుంది. దీనికితోడు ఈ సీజన్‌కి అసలు బిగ్ బాస్‌ మారిపోయాడనే ప్రచారం జరుగుతుంది. కొత్త వ్యక్తి వాయిస్ చెప్పబోతున్నట్టుగా వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. కేవలం ఈ అగ్నిపరీక్ష ప్రోమోస్‌ వరకే కొత్త వాయిస్‌ ఉంటుందని, రెగ్యూలర్‌ షోకి పాత వాయిసే ఉంటుందని సమాచారం. ఏది నిజమో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. షోకి బజ్ తగ్గిపోయింది.

45
బిగ్‌ బాస్‌ వాయిస్‌ ఇచ్చేది ఇతనే
Image Credit : star maa promo

బిగ్‌ బాస్‌ వాయిస్‌ ఇచ్చేది ఇతనే

మరి ఇంతకి బిగ్‌ బాస్‌ షోలో బిగ్‌ బాస్‌ కి వాయిస్‌ ఇచ్చేది ఎవరు? అనేది చూస్తే, అదొక డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్‌. పేరు రాధాకృష్ణ. ఆయన అసలు పేరు రేణుకుంట్ల శంకర్‌. తెలుగులో బిగ్‌ బాస్‌ షో ప్రారంభమైనప్పట్నుంచి ఆయనే బిగ్‌ బాస్‌ గా వాయిస్‌ అందిస్తున్నారు. చాలా గాంభీర్యంతో కూడిన ఆయన వాయిస్‌ షోకి వన్నే తీసుకొచ్చింది. ఈ షోకి బిగ్‌ బాస్‌ వాయిసే బలం. అది ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ వాయిస్‌కి చాలా మంది ఫ్యాన్స్ కూడా పుట్టుకొచ్చారు. తనదైన గాంభీర్యమైన స్వరంతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఆదేశాలిస్తూ ఆకట్టుకుంటున్నారు రాధాకృష్ణ. ఆయన్ని ఇప్పుడు మార్చేశారనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది.

55
సెప్టెంబర్‌ 7న బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ షురూ
Image Credit : star maa promo

సెప్టెంబర్‌ 7న బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ షురూ

ప్రస్తుతం రన్‌ అవుతున్న `బిగ్ బాస్‌ అగ్నిపరీక్ష`కి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. నోటెడ్‌ ఆర్టిస్ట్ లు లేకపోవడంతో నెటిజన్లు పట్టించుకోవడం లేదు. ఇది వచ్చే మెయిన్‌ షోపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు కామన్‌ మ్యాన్‌ కేటగిరి సుమారు ఐదుగురుని ఎంపిక చేసి, రెగ్యూలర్‌ సెలబ్రిటీ కోటాలో మరో 15-17 మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. ఈ సారి సుమారు 22 మంది కంటెస్టెంట్లకి ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే వీరిలో కొందరిని వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారం తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్‌ తెలుగు 9 సెప్టెంబర్‌ 7న ప్రారంభం కాబోతుంది.   సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hey Balwanth 6 Days Collections: హే బలవంత్‌ 6 రోజుల కలెక్షన్లు.. సుహాస్‌ మూవీ నిజంగానే సేఫ్‌ అయ్యిందా?
Recommended image2
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి నటించిన తొలి సినిమా ఏంటో తెలుసా? రామారావు చేసిన పనికి అక్కినేని షాక్‌
Recommended image2
ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డాన్స్ కి ఇన్‌స్పైర్‌ అయి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved