Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ జరుగనుందా? 20 లక్షలతో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడా?  షాకింగ్ ట్విస్ట్ 

బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ జరుగనుందా? 20 లక్షలతో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడా?  షాకింగ్ ట్విస్ట్ 

అనూహ్యంగా బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ చోటు చేసుకోనుందట. ఫైనల్ కి వెళ్ళేది నలుగురే అట. ఒక కంటెస్టెంట్ రూ. 20 లక్షలు తీసుకుని రేసు నుండి తప్పుకోనున్నారట.   

Sambi Reddy | Published : Dec 10 2024, 08:47 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నవంబర్ 15న ముగియనుంది. నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్ ఫైనల్ కి వెళ్లారు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా తన బెర్త్ టాప్ 5 లో కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగతా కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఓట్లు వేసి టైటిల్ రేసులో నిలిపారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. 
 

26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సీజన్ 7లో 6 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ కి పంపారు. అంబటి అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫైనలిస్ట్స్. ఈసారి కూడా ఒకరిని ఎలిమినేట్ చేసి ఆరుగురిని ఫైనల్ కి పంపుతారని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. ఓటింగ్ లో వెనకబడిన రోహిణి, విష్ణుప్రియలు 14వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ కి వెళ్లాలన్న వీరి ఆశలు గల్లంతు అయ్యాయి. 

 

36
Asianet Image

కాగా లేటెస్ట్ సీజన్లో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందట. కేవలం 4 గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ కి వెళతారట. టాప్ 5 కన్ఫర్మ్ అయ్యారు కదా.. నలుగురు ఫైనల్ కి వెళ్లడం ఏమిటని మీకు సందేహం రావచ్చు. సాధారణంగా ఫైనల్ లో కంటెస్టెంట్స్ కి హోస్ట్ నాగార్జున డబ్బులు ఎర వేస్తాడు. టైటిల్ రేసు నుండి తప్పించేందుకు ప్రైజ్ మనీ నుండి కొంత డబ్బు ఆఫర్ చేస్తాడు. టైటిల్ గెలిచేది ఒక్కరే. గెలవని వాళ్లకు ఏమీ దక్కదు. కాబట్టి ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని, వెళ్లిపోవచ్చని టెంప్ట్ చేస్తాడు. 

46
Asianet Image

సీజన్ 4లో సోహైల్, సీజన్ 7లో యావర్ డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నారు. యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టాప్ 4 తో సరిపెట్టుకున్నాడు. ఆ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి మిగిలిన రూ. 35 లక్షలు ప్రైజ్ మనీగా దక్కాయి. కాగా ఈ ఆఫర్ సీజన్ 8లో ముందుగానే ప్రవేశ పెడుతున్నారట. అది కూడా రూ. 20 లక్షలు అట. 

56
Asianet Image

టైటిల్ కొడతామని నమ్మకం లేని వాళ్ళు రూ. 20 లక్షలు తీసుకుని మిడ్ వీక్ లో ఎలిమినేట్ కావచ్చని బిగ్ బాస్ ఆఫర్ చేస్తాడట, ఈ ఆఫర్ ని అవినాష్ తీసుకున్నాడని సమాచారం. అవినాష్ కి టైటిల్ కొడతానని కొంచెం కూడా నమ్మకం లేదు. 11వ వారం నబీల్ అవిక్షన్ షీల్డ్ వాడి సేవ్ చేశాడు. ఇక టికెట్ టు ఫినాలే గెలవడం వలన రెండు వారాలు నామినేషన్స్ లో లేకుండా నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. 

 

66
Asianet Image

కాబట్టి అవినాష్ కి 4వ లేదా 5వ స్థానం మాత్రమే దక్కుతుంది. పైగా నిఖిల్ -గౌతమ్ మధ్యే టైటిల్ పోరు అనే విషయం హౌస్లో లీకైంది. కాబట్టి డబ్బులు తీసుకుని తప్పుకోవడం బెస్ట్ ఆప్షన్. అవినాష్ అదే చేశాడట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంత వరకు నిజం ఉందో తెలియదు.. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories