గౌతమ్ ను టార్గెట్ చేసి టైటిల్ కు దూరం అవుతున్న నిఖిల్, పెరుగుతున్న అశ్వధ్దామ గ్రాఫ్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ రేస్ లో నిఖిల్ ముందు ఉండేవాడు. కాని అనవసరంగా గౌతమ్ ను కదలించి టైటిల్ కు దూరం అవుతున్నాడేమో అనిపిస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వీకెండ్ రానే వచ్చింది. అయితే అంతకు ముందు ఓట్ ఆఫ్ అపీల్ లో చివరి అవకాశానికి సబంధించిన టాస్క్ లు నువ్వా నేనే అన్నట్టుగా జరిగాయి. ఈక్రమంలోనే కలిసిపోయారు అనుకున్న నిఖిల్, గౌతమ్ మధ్య మళ్ళీ మంటలు రగిలాయి. అయితేఈసారి మాత్రం నిఖిల్ దే తప్పుకనిపిస్తుంది.
అయితే వీరి టాస్క్ లకు సంచాలక్ గా ఉన్న ప్రేరణ కూడా నిఖిల్ ను ఆ టాస్క్ లో విన్నర్ ను చేయాలని చాలా ప్రయత్నం చేసింది. ఒక రకంగా ప్రేరణ సంచాలక్ గా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ఇక అనవసరంగా గౌతమ్ ను టార్గెట్ చేసి తన గ్రాఫ్ ను పడేసుకుంటున్నాడు నిఖిల్. టైటిల్ రేస్ లో ఉన్న ఈ ఇద్దరు మరోసారి గొడవపెట్టుకోవడం.. ఆడియన్స్ కు కూడా చిరాకు తెప్పిస్తోంది.
రెండు రోజులు ముందే ఒకరికి మరొకరు సారి చెప్పుకుని హగ్గులిచ్చుకుని మరీ ఫ్రెండ్స్ అయ్యారు. అంతలోనే టాస్క్ విషయంలో గౌతమ్ ను నిఖిల్ రెచ్చగొట్టడంతో గౌతమ్ కూడా రెచ్చిపోయాడు. దాంతో మాటలు జారడం మరోసారి తప్పలేదు. గౌతమ్ విషయంలో నిఖిల్ అనవసరంగా తన ఇమేజ్ ను పొగొట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది.
రంగు పడుద్ది టాస్క్ లో హోరా హోరీ పోరాడారు గౌతమ్, నిఖిల్, కాని సంచాలక్ గా ఉన్న ప్రేరణ కాస్త బయాస్ గా జడ్జిమెంట్ ఇచ్చినట్టు అర్దం అవుతుంది. ఎంతసేపు నిఖిల్ విన్ అవ్వాలి అన్న ఆలోచనే కనిపిస్తుంది.
ఇక అటు విష్ణు ప్రియ కూడా నిఖిల్ వైపు మాట్లాడటంకోసం గౌతమ్ ను నెగెటీవ్ చేస్తోంది. ఆమె మాట్లాడే మాటలు.. చేసు కామెంట్స్ సర్కాస్టిగ్ గా అనిపిస్తున్నాయి. నిఖిల్ విషయంలో హౌస్ అంతా గౌతమ్ ను ఒంటరివాడిని చేయాలని చూసినా..ఎక్కడా తగ్గలేదు గౌతమ్. గట్టిగా పాయింట్ టు పాయింట్ ఇచ్చిపడేశాడు. ఇక వీకెండ్ అని తెలుసు కాబట్టే.. గౌతమ్ ను రెచ్చగొట్టి.. అతను ఏదైనా నోరు జారితే.. నాగార్జున చేత తిట్టించబచ్చు అని నిఖిల్ అనుకున్నాడేమో.
గౌతమ్ ను సాధ్యమైనంత వరకూ రెచ్చగొట్టే ప్రయత్నమే చేశాడు. గేమ్ లో తనను నెట్టాడని.. కొట్టాడటని ఆరపణ చేశాడు. మరి ఈ వీకెండ్ లో నాగార్జున వీరిలో తప్పు ఎవరిది.. ఎవరు పొరపాటు చేశారు అనేది వీడియోతో సహా వేసి కడిగిపడేశే అవకాశం ఉంది.
\ఇక బిగ్ బాస్ హౌస్ లో తాజా ఎపిసోడ్ కు సబంధించి గెస్ట్ గా వచ్చారు ఓంకార్. తనహోస్ట్ చేస్తున్న జోడీ సీజన్ 3 ప్రోమోను చూపించారు. అంతే కాదు ఇంట్లో జంటలు గా విభజించి.. చిన్న టాస్క్ కూడా ఆడించారు.
ఇక ఈటాస్క్ లో ప్రేరణ హైలెట్ అయ్యింది. ఇక విన్నర్ కూడా అవ్వడంతో ఆమె తన పెళ్ళి వీడియోను బిగ్ బాస్ హౌస్ లో ప్లే చేయాలి అని అడిగారు. సో ప్రేరణ పెళ్ళి వీడయి్ ను చూసి హౌస్ మెంట్స్ తో పాటు ఆడియన్స కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక వీకెండ్ వచ్చేసింది. నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతారు. ఎవరు సేవ్ అవుతారు.. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు బయటకు వెళ్లిపోబోతున్నారు అనేది చూడాలి.