బిగ్ బాస్ లోకి డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీ జంట, ఈ సారి టీఆర్పీలు పెంచడానికేనా..?
ఈసారి బిగ్ బాస్ రసవత్తరంగా నడిపించడానికి ప్లాన్ చేసినట్టున్నారు బిగ్ బాస్ టీమ్. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ ప్రయోగానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

తెలుగు బిగ్ బాస్ ప్రతీసీజన్ కు రేటింగ్ పడిపోతూ వస్తోంది. దాంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు మేకర్స్. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ తో పాటు నాగార్జున చేసిన ఓ రెండు ఎపిసోడ్స్ మాత్రమే రేటింగ్ హైయెస్ట్ రాగా మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ ధారుణంగా పడిపోతూ వస్తున్నాయి. ఈసారి అయితే మరీ ధారుణం. బిగ్ బాస్ 6 ఇంకా బోర్ కొట్టించింది.
Bigg Boss Telugu 6
అటు హోస్ట్ నాగార్జునకు కూడా ఇంట్రెస్ట్ పోయినట్టుగా అనిపించింది. దాంతో ఈసారి హోస్ట్ గా ఉండనని చెప్పేశాడట నాగ్. కత్త హోస్ట్ గా రానా , బాలయ్య, విజయ్ దేవరకొండ లాంటి పేర్లు వినిపిస్తునాన్నాయి. ఈక్రమంలో బిగ్ బాస్ కు సంబంధించినమరో న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Bigg Boss Telugu 6
ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7ను ఎలాగైనా హిట్ చేసేయాలని పట్టుదలతో ఉన్నారట టీమ్. అందుకోసం ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ రష్మీని బిగ్ బాస్ లోకి తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారట. దానితో పాటు విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను కూడా హౌస్ లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట టీమ్.
టాలీవుడ్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న నోయల్.. ఆయన ఒకప్పటి భార్య నటి ఎస్తేర్. ఈ ఇద్దరు స్టార్లు చాలా కాలం ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు . అయితే పెళ్ళి చేసుకున్న కొన్నాళ్లకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. అంతే కాదు ఒకరిపై మరొకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఈ ఇద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని చూస్తున్నారట టీమ్.
ఆ మధ్య ఈ ఇద్దరి మధ్య ఇష్యూస్ గట్టిగానే అయ్యాయి. ఈ విషయంలో ఎస్తేర్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి... .నోయెల్ పై దారుణమైన కామెంట్స్ చేసింది. ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరిని హౌస్ లోకి పంపిస్తే టీఆర్పీలు బాగా వస్తాయన్న ఆలోచనతో బిగ్ బాస్ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి