చివరిలో సర్ ప్రైజ్ ఎంట్రీ.. శ్రీముఖి సెలక్ట్ చేసిన కంటెస్టెంట్ అతడే..
Bigg Boss Telugu 9 : శ్రీముఖి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో కింగ్ నాగార్జున అంగీకరించారు. ఆ తర్వాత సర్‌ప్రైజ్‌గా 15వ కంటెస్టెంట్‌గా మర్యాద మనీష్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఇంతకీ అతని బ్రాక్ డ్రాప్ ఎంటీ?

చదరంగం కాదు, రణరంగమే
Bigg Boss Telugu 9: ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో చదరంగం కాదు, రణరంగమే అని హోస్ట్ అక్కినేని నాగార్జున ముందే స్పష్టం చేశారు. అలాగే ఈసారి డబుల్ హౌస్ – డబుల్ డోస్ కాన్సెప్ట్‌తో షో రసవత్తరంగా సాగనుందని చెప్పారు. స్టేజ్‌పై ఒక్కొక్క కంటెస్టెంట్ తన స్టైలిష్ పర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చార. ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ తెలిపారు నాగ్.
సెలబ్రిటీలు ఎంతమంది? కామనర్స్ ఎంతమంది?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు.
ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా, 6 మంది కామనర్స్. సెలబ్రెటీలలో కన్నడ నటి తనూజ, సీనియర్ హీరోయిన్లు ఆశా షైనీ, సంజన గల్రానీ, భరణి శంకర్, రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్, కమెడియన్ సుమన్ శెట్టి, ఫోక్ సింగర్ రాము రాథోడ్, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఉన్నారు.
ఇక కామనర్స్ లో పవన్ కళ్యాణ్ పడాల, శ్రీజ దమ్ము, హరిత హరీష్, పవన్ డిమోన్, ప్రియా శెట్టి ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా హౌస్‌లోకి ప్రవేశించారు.
సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన కామనర్.
అయితే చివర్లో ట్విస్ట్. ఇక, నాగార్జున హౌస్‌కు లాక్ వేయబోతుండగా యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. అగ్నిపరీక్షలో ఎంతో కష్టపడి పోటీలో నిలిచిన కామనర్స్‌లో ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని నాగార్జునను కోరింది. బిగ్‌బాస్ అనుమతితో కార్డ్స్‌లోంచి ఎంపిక చేయమని నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శ్రీముఖి.. ఎంచుకున్న ఫోటో మర్యాద మనీష్ ది కావడంతో, అతను 15వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటర్ అయ్యాడు. హౌస్‌లోకి అడుగుపెట్టగానే కుటుంబం, స్నేహితుల తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
మనీష్ ప్రొఫైల్
ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ ఫెల్లో సహ వ్యవస్థాపకుడు మనీష్. 2021లో స్థాపించబడిన ఈ వేదిక పెట్టుబడిని వినియోగదారులకు మరింత సరదాగా మార్చేందుకు బహుమతులు అందిస్తుంది. అంతేకాకుండా, మనీష్ ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో కూడా స్థానం సంపాదించాడు.
సీజన్ ట్విస్ట్ ఇదే..
షో ప్రారంభమైన తొలి రోజే కింగ్ నాగార్జున ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ రివీల్ చేశారు. ఈసారి బిగ్‌బాస్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని ప్రకటించారు. కామనర్స్ మెయిన్ హౌస్‌లో (ఓనర్స్‌గా), సెలబ్రిటీలు ఔట్ హౌస్‌లో (టెనెంట్స్‌గా) ఉండాలని పేర్కొన్నారు. టాస్క్‌లు, అగ్నిపరీక్షల్లో రాణించగలవారే మెయిన్ హౌస్‌లో ఉండటానికి అర్హులని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్‌తో మొదలైంది, రేపటి నుంచే హౌస్‌లో అసలైన ఆట మొదలవుతోంది.