నా కోసం డ్యాన్స్ చేయండి, మాధురిని బతిమాలిన భరణి.. హౌస్ కి కొత్త కెప్టెన్ గా దివ్య
బిగ్ బాస్ హౌస్ లో దివ్య కొత్త కెప్టెన్ గా అవతరించింది. తనూజపై దివ్య పై చేయి సాధించి కెప్టెన్సీ అవకాశం దక్కించుకుంది. శ్రీజ మరోసారి ఎలిమినేట్ కావడం.. మాధురి, భరణి మధ్య జరిగిన సంఘటనల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

అనుకున్నట్లుగానే శ్రీజ అవుట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. హౌస్ లో 54వ రోజు కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ జరిగింది. అదే విధంగా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం భరణికి హౌస్ లో పర్మనెంట్ కంటెస్టెంట్ గా కొనసాగే అవకాశం దక్కింది. దీనితో శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయింది. ఇంటి సభ్యులు ఎమోషనల్ గా శ్రీజకి సెండాఫ్ ఇచ్చారు. కళ్యాణ్ అయితే శ్రీజ వెళ్లిపోతుండడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ భరణికి ఒక బాధ్యత ఇచ్చారు.
కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగురు
కెప్టెన్సీ టాస్క్ కోసం ఐదుగురు కంటెండర్లని ఎంచుకోవాలని బిగ్ బాస్ భరణికి సూచించారు. దీనితో భరణి తనతో పాటు సాయి, తనూజ, దివ్య, నిఖిల్ లని కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించారు. కెప్టెన్ ని ఎంపిక చేయడం కోసం బిగ్ బాస్ డీజే కెప్టెన్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్లు ఒక్కొక్కరుగా స్టేజిపైకి వెళ్లి డ్యాన్స్ చేయాలి. మరో స్టేజిపై ఆ కంటెండర్ కెప్టెన్ కావాలనుకునే ఇంటి సభ్యులు డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఆ కంటెండర్ కి సపోర్ట్ గా ఎంత మంది స్టేజిపై ఉంటారనేది సంచాలకుడు పరిగణలోకి తీసుకుంటాడు.
మాధురిని బతిమాలిన భరణి
ఇందులో భాగంగా తనూజకి 8 మంది సభ్యులు సపోర్ట్ చేశారు. అనే తర్వాతి స్థానంలో దివ్య నిలిచింది. భరణి డ్యాన్స్ చేయడానికి ముందు మాధురి వద్దకు వెళ్లి నాకు సపోర్ట్ చేయడానికి మీకు సమస్య ఏంటి.. మనిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. భరణి మాధురిని బతిమాలి మరీ తనకు సపోర్ట్ చేసేందుకు ఒప్పించాడు. దీనితో మాధురి భరణి కోసం డ్యాన్స్ చేసింది. తనూజ, దివ్య మాత్రమే టాప్ 2 లో నిలిచారు.
కొత్త కెప్టెన్ గా దివ్య
దీనితో వీరిద్దరి మధ్య బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ నిర్వహించారు. తనూజ కంటే దివ్యకి ఇతర సభ్యుల నుంచి ఎక్కువ మద్దతు లభించింది. ఎక్కువ మంది సభ్యులు ఆమెతో కలిసి డ్యాన్స్ చేశారు. భరణి మాత్రం వీళ్లిద్దరికీ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉండిపోయారు. ఎందుకంటే తనూజ, దివ్య ఇద్దరితూ భరణికి బాండింగ్ ఉంది. చివరికి బిగ్ బాస్ దివ్యని విజేతగా ప్రకటించారు. దీనితో దివ్య హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరించింది.
వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ
కెప్టెన్సీ అవకాశం చేజారడంతో తనూజ వెక్కి వెక్కి ఏడ్చింది. భరణి తనకి సపోర్ట్ చేయలేదని బాధపడింది. తనూజ ద్వారా గతంలో లబ్ది పొందిన వాళ్ళు కూడా ఆమెకి సపోర్ట్ చేయలేదని మాధురి పేర్కొంది. తాను హౌస్ లో ఒంటరిదాన్ని అని, తన గేమ్ తానే ఆడుతున్నాను అని, ఎవరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరని తనూజ కన్నీళ్లు పెట్టుకుంది.