రవితేజ, సిద్దార్థ్ అతిథులుగా బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఈవెంట్.. హౌస్ లోకి 6గురు కొత్త సభ్యులు, ఎవరెవరంటే
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 పై ఈసారి ఆడియన్స్ లో ఎలాగైనా ఆసక్తి పెంచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 పై ఈసారి ఆడియన్స్ లో ఎలాగైనా ఆసక్తి పెంచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు జరగబోయే సండే ఎపిసోడ్ లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు నాగార్జున క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు 7 ఐదవ వీకెండ్ లోకి వచ్చేసింది.
ఇప్పటికే దామిని, షకీలా, కిరణ్ రాథోడ్, రతిక ఎలిమినేట్ అయ్యారు. ఇక నేడు జరగబోయే సండే ఎపిసోడ్ ఊహించని ట్విస్ట్ లతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జున కూడా హింట్ ఇచ్చేశారు. నేడు డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శుభశ్రీ, ప్రియాంక జైన్ ఎలిమినేట్ అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఆదివారం రోజు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది. ఒక మినీ లాంచ్ లా ఉండబోతోందట. ఎందుకంటే హౌస్ లోకి 6 గురు కొత్త సభ్యులు వైల్డ్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హౌస్ లోకి వెళ్లబోయే కొత్త సభ్యుల వివరాలు కూడా అందరికి తెలిసిపోయాయి.
కెవ్వు కార్తీక్, నయని పావని, అర్జున్ అంబటి, పూజా మూర్తి, అశ్విని శ్రీ, భోలే షావలె కొత్త సభ్యులుగా హౌస్ లోకి ఆదివారం రోజు ప్రవేశిస్తారట. వీరి ఎంట్రీ కోసం అదిరిపోయే మినీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో అతిథులుగా మాస్ మహారాజ్ రవితేజ, హీరో సిద్దార్థ్ గెస్ట్ లుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
సాయంత్రం 7 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రసారం అవుతుందని అంటున్నారు. ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఇద్దరినీ హౌస్ నుంచి బయటకి పంపిస్తారా లేకసీక్రెట్ రూమ్ లాంటి సర్ప్రైజ్ ఉంటుందా అనేది వేచి చూడాలి.
ఇక బిగ్ బాస్ సీజన్ 6 దారుణమైన రేటింగ్స్ తో విమర్శల పాలైంది. సీజన్ 7 లో ఇలాంటి సర్ప్రైజ్ లో ప్లాన్ చేసి ఎలాగైనా ఆసక్తి పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి సండే ఎపిసోడ్ ఎంత వినోదాత్మకంగా ఉంటుందో చూడాలి.