- Home
- Entertainment
- బిగ్ బాస్ రన్నర్ శ్రీహాన్, లవర్ సిరికి శేఖర్ మాస్టర్ బంపర్ ఆఫర్... మనోడి టైం స్టార్ట్ అయ్యిందిగా!
బిగ్ బాస్ రన్నర్ శ్రీహాన్, లవర్ సిరికి శేఖర్ మాస్టర్ బంపర్ ఆఫర్... మనోడి టైం స్టార్ట్ అయ్యిందిగా!
బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ హౌస్ నుండి బయటకు వచ్చి నెల రోజుకు కాకుండానే అతనికి ఆఫర్స్ వెల్లువెత్తున్నాయి. లవర్ సిరితో కలిసి శ్రీహాన్ వెబ్ సిరీస్ కి సైన్ చేశాడు.

Sreehan
బిగ్ బాస్ సీజన్ 6(Bigg boss telugu 6) రన్నర్ శ్రీహాన్ అనూహ్యంగా టైటిల్ కోల్పోయాడు. ఆత్మవిశ్వాసం లేక టైటిల్ రేవంత్ కి అప్పగించాడు. నాగార్జున ఆఫర్ కి టెంప్ట్ అయ్యి బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ అందుకునే ఛాన్స్ కోల్పోయాడు. హోస్ట్ నాగార్జున(Nagarjuna) రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని చెప్పడంతో... బాగా ఆలోచించిన శ్రీహాన్ డబ్బులు తీసుకొని ఓటమిని అంగీకరించారు.
Bigg Boss Telugu 6
అయితే అత్యధిక ఓట్లతో టైటిల్ గెలిచింది శ్రీహాన్(Sreehan) అని నాగార్జున ఫైనల్ గా రివీల్ చేశాడు. దాంతో అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. స్వల్ప ఓట్ల తేడాతో రేవంత్ పై శ్రీహాన్ గెలిచాడని చెప్పడం సంచలనమైంది. గత ఐదు సీజన్స్ లో ఎన్నడూ జరగని పరిణామం ఇది. విన్నర్ రేవంత్, రన్నర్ శ్రీహాన్ ఇద్దరూ నొచ్చుకునే పరిస్థితి అక్కడ నెలకొంది.
టైటిల్ గెలుచుకున్నప్పటికీ శ్రీహాన్ వదిలేయడం వలన దక్కిందని రేవంత్(Revanth)... అనవసరంగా డబ్బులకు టెంప్ట్ అయ్యి విన్నర్ అయ్యే ఛాన్స్ కోల్పోయానన్న బాధ శ్రీహాన్ లో ఉండిపోయాయి. ఏది ఏమైనా ఈ సీజన్ కి ఇద్దరు విన్నర్స్ అవతరించారు. ప్రైజ్ మనీ కూడా ఇద్దరికీ సమానంగా దక్కింది. చెరో రూ. 45 లక్షలు గెలుచుకున్నారు.
Bigg Boss Telugu 6
టైటిల్ చేజారినా శ్రీహాన్ కొంత డబ్బు గెలుచుకున్నాడు. అతనికి గతంలో లేని ఫేమ్ గుర్తింపు వచ్చాయి. బిగ్ బాస్ షో శ్రీహాన్ కి తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ తెచ్చింది. ఈ గుర్తింపు శ్రీహాన్ కి వెండితెర ఆఫర్స్ తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఓకే చేశారు.
Sreehan
శేఖర్ మాస్టర్ నిర్మాతగా శ్రీహాన్-సిరి జంటగా వెబ్ సిరీస్ ప్రకటించారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ సిరీస్ కి సుజిత్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలో శ్రీహాన్-సిరిలకు టైం స్టార్ట్ అయ్యింది. ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యే సూచనలు కలవు అంటున్నారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. కాగా శ్రీహాన్-సిరి యూట్యూబర్స్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
Bigg Boss Telugu 6
ప్రస్తుతం సిరి బీబీ జోడి చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్టార్ మాలో బీబీ జోడి పేరుతో ఒక డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేశారు. ఈ ఎంటర్టైనింగ్ షోలో సిరి-యాంకర్ రవి జంటగా డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఇక త్వరలో సిరి-శ్రీహాన్ కాంబోలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వారిద్దరికీ మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టే సూచనలు కలవు.