Bigg Boss Telugu 6: బిగ్ బాస్ గీతూ రాయల్ భర్త ఎవరు? ఏం చేస్తుంటాడో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 6 టాప్ కంటెస్టెంట్స్ లో గీతూ రాయల్ ఒకరు. ఆమె టాప్ ఫైవ్ లో ఒకరిగా ఉంటుందనేది ఖాయం. ఫస్ట్ వీక్ నుండి గేమ్ లో తన మార్క్ చూపిస్తూ శబాష్ అనిపించుకుంటుంది. ఈ క్రమంలో గీతూ రాయల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Bigg Boss Telugu 6
హౌస్ లో గీతూ అల్లరి చూసిన ఆడియన్స్ ఈమెను భరించడం చాలా కష్టమన్న భావన వెల్లిబుచ్చుతున్నారు. దాపరికం లేకుండా మాట్లాడటం, మగాడిని తలపించే ప్రవర్తన, ఆ ధైర్యం, మాట తీరు చూసి ఈమెను చేసుకున్నోడు ఎవడో కానీ పాపం అంటూ జాలి చూపిస్తున్నారు. మరి గీతూ లాంటి అమ్మాయితో వేగుతున్న ఆ అబ్బాయి పేరు వికాస్.
Bigg Boss Telugu 6
వికాస్ ది తమిళ నేపథ్యం అని తెలుస్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో తమ మదర్ టంగ్ తమిళం అని అతడు చెప్పాడు. గీతూ-వికాస్ మధ్య చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. ఒకరరికి మరొకరు ఎప్పటి నుండో తెలుసు. స్నేహితులు కాస్తా పెళ్లి బంధంతో భార్యాభర్తలు అయ్యారు.
Bigg Boss Telugu 6
ఇక వికాస్ ఒక కార్పొరేట్ కంపెనీలో ఐటీ జాబ్ చేస్తున్నారు.వికాస్ నుండి గీతూకు మంచి సప్పోర్ట్ ఉంది. అలాగే హౌస్లో గీతూ గేమ్ చాలా బాగుందని వికాస్ అభిప్రాయం. ఎప్పుడూ పక్కనుండే గీతూ లేకపోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆమె ఎన్ని వారాలు ఉన్నప్పటికీ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది అన్నాడు.
Bigg Boss Telugu 6
గీతూ మాట తీరు గురించి మాట్లాడుతూ... ఆమె రూడ్ గా మాట్లాడినట్లు ఉంటుంది కానీ అది నిజం కాదు . గీతూ మాట తీరే అంత, తన వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది. పలకరింపులో కూడా సాఫ్ట్ నెస్ ఉండదు. హౌస్లో గీతూ నటించడం లేదు. సహజంగా ఆమె ఎలా ఉంటారో అలానే ఉంటుంది. నటన అయితే ప్రతివారం ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుందని వికాస్ అభిప్రాయపడ్డారు.
ప్రేక్షకులు సైతం గీతూ ఆట పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఆమె రాయలసీమ యాస, యాటిట్యూడ్ ఇష్టపడేవారు లేకపోలేదు. కొందరు అమ్మాయిలకు గీతూ కాన్ఫిడెంట్ లెవల్స్ స్ఫూర్తి అని చెప్పాలి.
ఇక ఈ వారం గీతూ ఎలిమినేషన్ నుండి తప్పుకుంది. హౌస్లో ఉన్న 15 మందిలో 13 మంది నామినేట్ అయ్యారు. రేవంత్, బాలాదిత్య, రోహిత్, వాసంతి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయ్యారు.