- Home
- Entertainment
- ఫైనల్ కి ముందే రిజల్ట్ లీక్... బిగ్ బాస్ విన్నర్-రన్నర్ గా వాళ్లిద్దరూ... మిగతా వాళ్ళ పొజిషన్స్ ఇవే?
ఫైనల్ కి ముందే రిజల్ట్ లీక్... బిగ్ బాస్ విన్నర్-రన్నర్ గా వాళ్లిద్దరూ... మిగతా వాళ్ళ పొజిషన్స్ ఇవే?
డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలే జరగనుంది. బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ క్రమంలో విజేత ఎవరు? టాప్ ఫైవ్ లో ఎవరి పొజీషన్ ఎవరనే ఊహాగానాలు, అంచనాలు తెరపైకి వచ్చాయి.

21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 ప్రారంభమైంది. గత సీజన్స్ తో పోల్చితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదనేది నిజం. షోకి వస్తున్న దారుణమైన టీఆర్పీ దానికి నిదర్శనం. ఒక సక్సెస్ఫుల్ సీరియల్ కి ఉన్న ఆదరణ కూడా బిగ్ బాస్ వంటి పెద్ద రియాలిటీ షోకి రాకపోవడం ఊహించని పరిణామం.
జయాపజయాల సంగతి పక్కన పెడితే గ్రాండ్ ఫినాలేకి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కంటెస్టెంట్ శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు వెళ్ళిపోయింది. మెజారిటీ కంటెస్టెంట్స్ కీర్తిని బయటకు పంపాలని చెప్పారు. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం శ్రీసత్య హౌస్ వీడాల్సి వచ్చింది.
టాప్ 5 కి రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, కీర్తి వెళ్లారు. బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్స్ గా ఈ ఐదుగురు మిగిలారు. వీరిలో ఒకరు విన్నర్ గా అవతరించనున్నారు. ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ లో విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఆడియన్స్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కి ఓటు వేసే ప్రక్రియ ముగిసింది. రిజల్ట్ రావాల్సి ఉంది.
Bigg Boss Telugu 6
ఫినాలే(Bigg Boss Telugu 6 finale) నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. విన్నర్,రన్నర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజీషన్ ఇలానే ఉటాయంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. మెజారిటీ వర్గాల అంచనా ప్రకారం ఫలితాలు ఇలా ఉన్నాయి.
Bigg Boss Telugu 6
బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్(Revanth) అని ఫిక్స్. అసలు టైటిల్ విన్నర్ ఒప్పందంతోనే ఆయన్ని హౌస్లోకి పంపారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో రేవంత్ ని బెస్ట్ కంటెస్టెంట్ గా హోస్ట్, మేనేజ్మెంట్ ప్రయత్నం చేశారు అంటున్నారు. అందులోనూ రేవంత్ కి ఉన్నంత ఫేమ్ ఇతర కంటెస్టెంట్స్ ఎవరికీ లేదు. కాబట్టి విన్నర్ గా రేవంత్ టైటిల్ అందుకోవడం ఖాయం అంటున్నారు.
Bigg Boss Telugu 6
ఇక రన్నర్ పొజీషన్ శ్రీహాన్(Sreehan) దే అంటున్నారు. రన్నర్ పొజీషన్ కోసం ఆదిరెడ్డి(Adireddy) రోహిత్ కూడా పోటీపడే సూచనలు కలవు. ఎందుకంటే ఆదిరెడ్డి, రోహిత్ సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. గేమ్ తో ఆదిరెడ్డి, క్యారెక్టర్ తో రోహిత్ ఆకట్టుకున్నారు.
శ్రీహాన్ రన్నర్ అయితే థర్డ్ పొజీషన్ ఆదిరెడ్డికి, ఫోర్త్ పొజీషన్ రోహిత్ కి దక్కనున్నాయట. ఇక కీర్తికి ఫిఫ్త్ పొజీషన్ దక్కనుందట. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఫైనల్ రిజల్ట్స్ ఇవే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ఉత్కంఠకు, ఊహాగానాలకు కొన్ని గంటల్లో తెరపడనుంది.