MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 6: టికెట్ టు ఫినాలే కోసం కొట్టుకున్న ఇనయా-కీర్తి... ఒకరిపై ఒకరుపడి ఏందీ సామీ ఈ రచ్చ!

Bigg Boss Telugu 6: టికెట్ టు ఫినాలే కోసం కొట్టుకున్న ఇనయా-కీర్తి... ఒకరిపై ఒకరుపడి ఏందీ సామీ ఈ రచ్చ!

బిగ్ బాస్ హౌస్లో కీలకమైన టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేటైన కీర్తి, ఇనయా, శ్రీసత్యలకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. ముగ్గురి మధ్య ఓ గేమ్ పెట్టి గెలిచినవారు టికెట్ టు ఫినాలే టాస్క్ లో పోటీపడవచ్చన్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 30 2022, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. 
 

28
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

12వ వారం రాజ్ ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ కాకుండా రెండు ఆదివారాలు మాత్రమే ఉన్నాయి. మూడు ఎలిమినేషన్స్ జరగాలి. దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రస్తుత కెప్టెన్ నిర్ణయం కీలకం కానుందని తెలుస్తుంది. ఈ క్రమంలో బలి అయ్యే కంటెస్టెంట్ ఎవరనే ఆసక్తి నెలకొంది.

38
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


హౌస్ కి లాస్ట్ కెప్టెన్ ఇనయా. కాబట్టి కెప్టెన్సీ టాస్క్ స్థానంలో టికెట్ టు ఫినాలే టాస్స్ నిర్వహిస్తున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న సభ్యుడు నేరుగా ఫైనల్ కి చేరుకోవచ్చు. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో కూడా ఆ కంటెస్టెంట్ ఉండడు. ఈ క్రమంలో ఫైనల్ కి చేరుకోవాలని కంటెస్టెంట్స్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. 

48
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ స్నోమాన్ టాస్క్ నిర్వహించాడు. స్నోమాన్ బొమ్మ భాగాలు సేకరించి రూపొందించాలి. అదే సమయంలో తమ బొమ్మను ఇతర కంటెస్టెంట్స్ నుండి కాపాడుకోవాలి. ప్రతి రౌండ్ లో తక్కువ భాగాలతో స్నోమాన్ ని నిర్మించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ నుండి తప్పుకుంటాడు. 
 

58
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


స్నోమాన్ టాస్క్ లో మొదట శ్రీసత్య తర్వాత కీర్తి, ఇనయా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరు టికెట్ టు ఫినాలే టాస్క్ లో పోటీపడేందుకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. కీర్తి, ఇనయా, శ్రీసత్యల మధ్య ఒక గేమ్ పెట్టిన బిగ్ బాస్ గెలిచిన కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే టాస్క్ లో పోటీపడవచ్చు అన్నారు. 
 

68
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


దీనిలో భాగంగా ముగ్గురూ తెల్ల టీషర్ట్స్ ధరించాలి. సర్కిల్ లో నిల్చొని పక్కనే ఉన్న రెడ్ పెయింట్ చేతులతో ఇతరుల వీపుపై రాసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ తమకు రాయకుండా కాపాడుకోవాలి. ఈ గేమ్ లో శ్రీసత్యకు ఎక్కువ పెయింట్ అయ్యింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. 
 

78
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో ఇనయా, కీర్తి నెక్స్ట్ రౌండ్ లో పోటీపడ్డారు. గెలుపు కోసం ఇనయా, కీర్తి హోరాహోరీగా పోటీపడ్డారు. ఒకరి వీపుపై మరొకరు రెడ్ కలర్ రాసేందుకు శాయశక్తులా కృషి చేశారు. కిందా మీదా పడుతూ ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పని చేశారు. బజర్ మోగగానే గేమ్ ఆపేశారు. 

88
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

సంచాలక్ గా ఉన్న రేవంత్ విన్నర్ ని నిర్ణయించడం చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే ఇద్దరి టీషర్ట్స్ పై ఎక్కువగానే రంగు ఉంది అన్నారు. ఫైనల్ గా తన నిర్ణయం చెప్పాడు. అయితే ఎవరు టికెట్ టు ఫినాలే టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ అందుకున్నారనేది సస్పెన్స్. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో సస్పెన్స్ తో ముగిసింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image2
Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు
Recommended image3
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved