MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జైలుపాలైన చిన్నోడు... మాటల యుద్ధంలో ఉమాదేవిని నోరుముయ్ అన్న ట్రాన్స్ జెండర్ ప్రియాంక!

జైలుపాలైన చిన్నోడు... మాటల యుద్ధంలో ఉమాదేవిని నోరుముయ్ అన్న ట్రాన్స్ జెండర్ ప్రియాంక!

నిన్న బిగ్ బాస్ హౌస్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి ఆరోపణలు, వాదనలు నడిచాయి. 

3 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 11 2021, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గణపతి పూజ అనంతరం బిగ్‌బాస్‌ లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు పాల్గొనాల్సి ఉండగా హౌస్‌మేట్స్‌ విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను సూచించారు. ఈ నిర్ణయంపై నటరాజ్‌ మాస్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ బలం చూడాలి కానీ కండలు కాదంటూ విశ్వను సెలక్ట్‌ చేయడాన్ని తప్పు పట్టాడు. తాను ఒక్కరిని కాదు, ఇద్దరినైనా లేపుతానంటూ రభస చేయగా యాంకర్‌ రవి ఆయనకు నచ్చజెప్పాడు. మొత్తానికి విశ్వ, శ్రీరామచంద్ర ఈ టాస్క్‌లో పాల్గొని విజయవంతంగా తమకు కావాల్సిన సరుకులను తెచ్చుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని ఎంజాయ్ చేసిన కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ లో పరీక్ష పెట్టాడు. ఈవారానికి గాను ప్రతి కంటెస్టెంట్ బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్‌లను ఎన్నుకోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఎంటర్‌టైన్‌ చేస్తున్న లోబో బెస్ట్‌ పర్ఫామర్‌ అని, కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకున్న జెస్సీ వరస్ట్‌ పర్ఫామర్‌ అని రవి తన అభిప్రాయం తెలియజేశారు. అనంతరం లోబో.. కిచెన్‌లో ఎలాంటి సమస్యలు తేనందుకు యానీ మాస్టర్‌ బెస్ట్‌ అని.. తెలిసో, తెలియకో తప్పులు చేస్తూ, నోరు జారుతున్న జెస్సీ వరస్ట్‌ పర్ఫామర్‌ అని తెలిపాడు. అనంతరం జెస్సీ వంతురాగా.. సిరిని బెస్ట్‌, టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడంటూ రవిని వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపిక చేశాడు. శ్వేత వర్మ.. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ విశ్వ బెస్ట్‌, పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్న ఉమాదేవి వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పింది.
 

36

ఉమాదేవి.. విశ్వ బెస్ట్‌గా, కాజల్‌ వరస్ట్‌గా ఆడుతున్నారని సింపుల్‌గా తేల్చేసింది. సిరి.. నటరాజ్‌ మాస్టర్‌ బెస్ట్‌, ఉమాదేవి ప్రవర్తన వల్ల కొందరు ఇబ్బందిపడుతున్నారని, అందువల్ల ఆవిడే వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పింది. విశ్వ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ప్రియాంక సింగ్‌ బెస్ట్‌ అని చెప్పడంతో పింకీ ఎమోషనల్‌ అయింది. ఇక పనులు రావని చెప్పి తప్పించుకునే కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా సూచించాడు. లహరి.. విశ్వ బెస్ట్‌ పర్ఫామర్‌ అని, కెప్టెన్‌ అయింది సిరి కానీ, అలా వ్యవహరిస్తుంది మాత్రం కాజల్‌ అంటూ ఆమెను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పుకొచ్చింది.


 

46

మనసారా నవ్వించిన లోబో బెస్ట్‌ పర్ఫామర్‌ అంది. ఇక పెద్దావిడగా మంచీ చెడ్డలు చెప్పాల్సిన ఉమాదేవి మనిషులను చులకనగా చూస్తూ, అమర్యాదగా మాట్లాడతారని పేర్కొంది. ఆమె ప్రవర్తన రూడ్‌ అని చెప్తూ ఉమాదేవిని వరస్ట్‌ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. అయితే ఆమె మాటలతో ఏకీభవించని ఉమా.. నీతో మాట్లాడటమే వేస్ట్‌ అంది. ఈ మాటతో ఆవేశపడ్డ పింకీ.. మీలా మనుషులను చీప్‌గా తీసిపడేయలేను అని ధీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే రాజుకుంది. ఒకరి మీదకు ఒకరు దూసుకు వెళ్లడమే కాక పింకీ షటప్‌ అంటూ ఆమెకు వేలు చూపించడంతో ఉమాదేవి కాళికావతారం ఎత్తింది. అయితే కొన్ని క్షణాల తర్వాత నోరుజారానని తెలుసుకున్న పింకీ తాను కోపంలో షటప్‌ అనేశానని ఉమాకు సారీ చెప్పి ఏడ్చేసింది.

56

ఇక ఉమాదేవిని ఎవరో ఒకరు ఎగతాళి చేస్తూనే ఉన్నారని సరయూ తెగ ఫీలై ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత యానీ మాస్టర్‌.. పింకీ బెస్ట్‌, జెస్సీ వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పింది. సరయూ.. లోబోను బెస్ట్‌ పర్ఫామర్‌గా సూచించింది. 'జెస్సీ చిన్నపిల్లాడు కాదు, అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏ పనీ చేయడు. ఓన్లీ టాయిలెట్‌కు వెళ్లడమే నువ్వు చేసే పనా?' అని ప్రశ్నిస్తూ అతడిని వరస్ట్‌ పర్ఫామర్‌గా సూచించింది.

 

66

కంటెస్టెంట్లు వారి అభిప్రాయాలు తెలిపిన అనంతరం.. ఎక్కువ ఓట్లతో విశ్వ బెస్ట్‌ పర్ఫామర్‌గా, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్‌గా ప్రకటించారు. బిగ్‌బాస్‌ ఆదేశం మేరకు వరస్ట్‌ పర్ఫామర్‌ అయిన జెస్సీని జైల్లో బందీ చేశారు. తనకు పట్టిన దుస్థితికి అతడు లోలోపలే కుమిలిపోయాడు. అతడి బాధ అర్థమైన హౌస్‌మేట్స్‌.. అందరం నీ వెనకాలే ఉంటామంటూ ఓదార్చారు. చూస్తుండగానే తొలి వారాంతం వచ్చేసింది.. రేపటి ఎపిసోడ్‌లో నాగ్‌ ఎవరెవరిని సేవ్‌ చేస్తాడో చూడాలి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved