MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ ఫేమ్, కార్తీక దీపం విలన్ శోభా శెట్టి రహస్యంగా పెళ్లి చేసుకుందా? వైరల్ అవుతోన్న షాకింగ్ ఫోటోస్

బిగ్ బాస్ ఫేమ్, కార్తీక దీపం విలన్ శోభా శెట్టి రహస్యంగా పెళ్లి చేసుకుందా? వైరల్ అవుతోన్న షాకింగ్ ఫోటోస్

నిశ్చితార్థం జరిగి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు బిగ్ బాస్ బ్యూటీ, కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి. ఆమె ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని అభిమానులు గుసగుసలాడుకుంటున్న టైంలో శోభా శెట్టి పెళ్లి ఫోటోలు బయటక వచ్చాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 29 2025, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శోభా శెట్టి రహస్య వివాహం?
Image Credit : Asianet News

శోభా శెట్టి రహస్య వివాహం?

కన్నడ బ్యూటీ, తెలుగు సీరియల్ నటి, బిగ్ బాస్‌లో సందడి చేసిన శోభా శెట్టికి నిశ్చితార్థమై రెండేళ్లు అవుతోంది. తన కో యాక్టర్ యశ్వంత్ రెడ్డిని ప్రేమించిన శోభా.. గత ఏడాది నిశ్చితార్ధం చేసుకుంది. కానీ ఇప్పటి వరకూ ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ఫ్యాన్స్ అడుగుతున్న టైంలో.. తాజాగా ఆమె పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్
Image Credit : Instagram

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్

'అగ్నిసాక్షి' సీరియల్‌తో తెలుగు తెరకు పరిచయమైనా శోభా శెట్టి.. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు టీవీ రంగంలోనే పాపులారిటీ సంపాదించింది. తర్వాత తెలుగు బిగ్ బాస్‌తో మరింతగా ఫేమస్ అయ్యింది బ్యూటీ. ఆతరువాత ఆమె కన్నడ బిగ్ బాస్ 11లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అలరించింది. ఈ రెండు భాషల బిగ్ బాస్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది శోభా శెట్టి.

36
కార్తీక దీపం సీరియల్ తో పాపులారిటీ
Image Credit : Instagram

కార్తీక దీపం సీరియల్ తో పాపులారిటీ

శోభా శెట్టి తెలుగులో 'కార్తీక దీపం' సీరియల్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే శోభా శెట్టి తన ప్రేమ విషయం వెల్లడించింది. కార్తీక దీపం సీరియల్ లో తన మరిది ఆదిత్య పాత్రలో నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది శోభా శెట్టి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్ 2024లో నిశ్చితార్థం చేసుకుని, ఈ ఏడాది ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా జరుపుకుంది జంట.

46
పెళ్లి ఫోటోలు వైరల్
Image Credit : Instagram

పెళ్లి ఫోటోలు వైరల్

అంతేకాదు, పెళ్లి గురించి అడిగినప్పుడు ఈ ఏడాదే చేసుకుంటానని శోభా చెప్పింది. కానీ ఇప్పటివరకు పెళ్లిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా అందరికి షాక్ ఇస్తూ.. ఆమె పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి పెళ్ళికి సంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

56
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్
Image Credit : Instagram

సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్

ఈ వైరల్ వీడియో, ఫోటోలలో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి పెళ్లి చేసుకుంటున్నట్లు ఉంది. పసుపు చీరలో శోభా, పంచెలో యశ్వంత్ తలంబ్రాలు పోసుకుంటున్న ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్లకు ఎప్పుడు పెళ్లయిపోయింది అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

66
జువెల్లరీ యాడ్ కోసం
Image Credit : Instagram

జువెల్లరీ యాడ్ కోసం

అయితే వీరు నిజంగా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు షూటింగ్ కోసం చేసినట్టు సమాచారం. ఒక జువెల్లరీ బ్రాండ్ యాడ్ లో వీరు నటించారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తుండటంతో.. గోల్డ్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో శోభా, యశ్వంత్ పెళ్లి చేసుకున్నట్లుగా నటించి, యాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసి, అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు.. మరి మీరు నిజంగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Recommended image3
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Related Stories
Recommended image1
పుట్టబోయే పిల్లల గురించి రష్మిక మందన్న పక్కా ప్లానింగ్, వారికోసం ఏం చేయబోతుందంటే?
Recommended image2
విజయ్ బాటలో రజినీకాంత్, సినిమాలకు గుడ్ బై చెప్పబోతోన్న సూపర్ స్టార్ ? లాస్ట్ మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved