పెళ్లిపై స్పందించిన బిగ్‌ బాస్‌ బ్యూటీ భాను శ్రీ

First Published 12, May 2020, 11:03 AM

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో పార్టిసిపెంట్‌ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ భాను శ్రీను. కుమారి 21 ఎఫ్‌, కాటమరాయుడు, ఇద్దరి మధ్య లాంటి సినిమాలతో పాటు బాహుబలి లాంటి భారీ చిత్రంలోనూ నటించింది భాను శ్రీ. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. అయితే టివీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పింది భానుశ్రీ. ఒక దశలో ఉండటానికి ప్లేస్‌ కూడా లేకపోవటంతో ఎంతో ఇబ్బంది పడినట్టుగా వెళ్లడించింది. అయితే ఆ సమయంలో ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయిన వ్యక్తి తనను ఎంతో ఆదుకున్నాడని చెప్పింది.

ఆ వ్యక్తి జీవితాంతం తనకు అండంగా ఉంటాడన్న నమ్మకం కలిగించాడని, భవిష్యత్తులోనూ తనకు కష్టం రాకుండా చూసుకుంటాడన్న నమ్మకం కలిగించాడని అందుకే అతనితోనే జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపింది.

ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్న సమయంలో కృంగిపోకుండా తనకు అండా ఉన్నాడని, అలాంటి వ్యక్తి తోడుగా ఉంటే ఎన్ని కష్టాలైనా ఎదిరించి ధైర్యంగా పోరాడ వచ్చని చెప్పింది. దీంతో త్వరలోనే భాను వివాహం ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఇతరులతో కలవాలంటే ఎంతో భయంగా ఉండేదని, అందుకే ఎవరితోనూ ఎక్కువగా కలిసేదాన్ని కాదని తెలిపింది. ఆ సమయంలో తనకు పరిచయం అయిన వ్యక్తినే త్వరలో పెళ్లి  చేసుకోబోతున్నానని చెప్పింది.

తాజాగా ఏడు చేపల కథ అనే బోల్డ్ సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. అయితే బిగ్‌ బాష్‌తో మంచి పేరు వచ్చినా, నటిగా మాత్రం భానుశ్రీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావటం లేదు.

loader