పెళ్లికూతురైన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్
`జబర్దస్త్` కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ ద్వారా మరింతగా పాపులర్ అయ్యింది ప్రియాంక సింగ్. త్వరలో ఆమె పెళ్లిపీఠలెక్కబోతుందని తెలుస్తుంది. తాజాగా హల్దీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సాయితేజగా జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి ఆకట్టుకుంది ప్రియాంక సింగ్. ఆమె ఆడలక్షణాలు ఎక్కువగా ఉండటంతో జెండర్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అలా ప్రియాంక సింగ్‌గా మారిపోయింది. జెండర్ మార్చుకున్నాక జబర్దస్త్ కి దూరంగా ఉన్న ఆమె బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఐదో సీజన్‌లో చాలా బాగా గేమ్ ఆడి చివరి వారాల వరకు ఉంది.
ఇందులో మానస్‌తో లవ్ ఎఫైర్ నడిపించింది. ఆయనకు క్లోజ్‌గా మూవ్ అవుతూ ప్రేమిస్తుందా? అనే ఫీలింగ్‌ని కలిగించింది. అతను మాత్రం దూరం పెట్టారు. ఇది పెద్ద ఇష్యూగా మారింది. అయితే ట్రాన్స్ జెండర్‌గా మారడంతో పింకీ పిల్లలను కనే పరిస్థితిని కోల్పోయిందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మ్యారేజ్ చేసుకోవడం కష్టమే అనే టాక్ వచ్చింది.
తాజాగా ఊహించని షాకిచ్చింది ప్రియాంక సింగ్. పెళ్లికూతురుగా ముస్తాబైంది. ఏకంగా హల్దీ ఫంక్షన్ కూడా చేసుకుంది. హల్దీ ఫంక్షన్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంది ప్రియాంక సింగ్. ఇందులో పలుపు పచ్చ శారీ కట్టింది. అందంగా పందిరి ముస్తాబు చేసింది. పూల రేకులు జళ్లుతూ హల్దీ ఫంక్షన్‌ని ఎంజాయ్ చేసింది ప్రియాంక సింగ్.
ఒక్కతే ఇలా మండపానికి పూలుచుట్టుతూ, ఫ్లవర్స్ వేస్తూ, తెగ సందడి చేసింది. ఆమె పంచకున్న ఫోటోలు, వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అంతా ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లికి ముందు ఇలా హల్దీ ఫంక్షన్ చేస్తారనే విషయం తెలిసిందే. అంతే ప్రియాంక మ్యారేజ్ ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పాలి.
అయితే `సీతారామం` సినిమాలోని పాటకి ప్రియాంక సింగ్ ఇలా అందంగా ముస్తాబై రీల్స్ తరహాలో ఈ వీడియోని చేయడం గమనార్హం. మరి ఇదే ఇప్పుడు ఆలోచింప చేస్తుంది. ప్రియాంక సింగ్ నిజంగానే మ్యారేజ్ చేసుకుంటుందా? లేక ఏదైనా షో కోసం డిజైన్ చేసిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రియాంక సింగ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే వార్త నమ్మశక్యంగా లేదంటున్నారు నెటిజన్లు. బిగ్ బాస్ బ్యూటీ మ్యారేజ్ ఇంత సడెన్‌గా జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ అందరు మాత్రం ప్రియాంక సింగ్‌కి మ్యారేజ్ శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.