- Home
- Entertainment
- సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా... ఐ లవ్ యూ అంటూ హీరో సోహెల్ కి గాలం వేసిన బిగ్ బాస్ బ్యూటీ
సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా... ఐ లవ్ యూ అంటూ హీరో సోహెల్ కి గాలం వేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఇనయా తన బిగ్ బాస్ క్రష్ సూర్యకు హ్యాండిచ్చింది. హౌస్ నుండి బయటకు రాగానే హీరోగా ఫార్మ్ లో ఉన్న సోహెల్ కి గాలం వేసింది. ఐ లవ్ యూ అంటూ కొత్త ప్రియుడికి ప్రపోజ్ చేసింది.

Bigg boss Inaya Sulthana
బిగ్ సీజన్ 6 (Bigg Boss Telugu 6)లో లేడీ టైగర్ గా పేరు తెచ్చుకుంది ఇనయా సుల్తానా. ఈ బోల్డ్ బ్యూటీ చర్యలు ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేశాయి. కంటెస్టెంట్ ఆర్జే సూర్య తన క్రష్ అని ఒప్పుకున్న ఇనయా... అతనితో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఆ ప్రేమ మైకంలో గేమ్ కూడా వదిలేసింది. నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో సూర్యకు దూరంగా ఉన్నట్లు నటించింది.
Bigg Boss Telugu 6
అనూహ్యంగా ఇనయా నామినేట్ చేసిన వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. అతని ఎలిమినేషన్ ని ఇనయా తట్టుకోలేకపోయింది. క్రష్ అని చెప్పుకుంటూ సూర్యను నామినేట్ చేసి అతనికి వెన్నుపోటు పొడిచావని, ఈ విషయంలో శ్రీహాన్, శ్రీసత్య ఆమెపై మాటల దాడి చేశారు. సూర్య ఎలిమినేట్ అయినపప్పటికీ హౌస్లో తను వాడిన వస్తువులతో సహజీవనం చేసి ఇనయా ప్రేమ చాటుకుంది.
Bigg Boss Telugu 6
ఎఫైర్స్ ఇనయాపై నెగిటివిటీ తెచ్చినప్పటికీ ఆమె పోరాట పటిమ ఆడియన్స్ కి నచ్చేసింది. ఇనయా వారాలు గడిచే కొద్ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం, ఎంత మంది ఎదురుగా ఉన్న తన స్టాండ్ పై తాను నిలబడటం ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. ఫైనల్ కి ముందు 14వ వారం ఇనయా ఎలిమినేట్ అయ్యింది. ఇనయాను బయటకు పంపడం విమర్శల పాలైంది.
Bigg boss Inaya Sulthana
ఇక హౌస్లో సూర్యపై ఆమె ప్రేమ కురించిన విధానం చూసి బయటకు వచ్చాక కూడా రిలేషన్ కంటిన్యూ అవుతుందనుకున్నారు. అయితే ఆ సూచనలు కనబడటం లేదు. సూర్యకు హ్యాండ్ ఇచ్చిన ఇనయా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసింది. మీరంటే నాకు ఇష్టం. బిగ్ బాస్ షోలో మిమల్ని చూసినప్పటి నుండి ప్రేమ మొదలైంది. ఐ లవ్ యూ అంటూ నేరుగా సోహెల్ ఆఫీస్ కి వెళ్లి చెప్పింది.
Bigg boss Inaya Sulthana
ఇనయా(Inaya Sulthana) ప్రపోజల్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో సోహెల్ కి అర్థం కాలేదు. అతడు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. రెడ్ గౌన్ లో హాట్ గా తయారైన ఇనయా ఒక రొమాంటిక్ లవ్ ప్రపోజల్ సెటప్ తో వచ్చింది. ఆమె తీరు చూసిన జనాలు ఆర్జే సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా... హీరోగా ఫార్మ్ లోకి వస్తున్న సోహెల్ ని లైన్ లో పెడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Bigg boss Inaya Sulthana
అయితే ఈ డ్రామా మొత్తం ప్రమోషన్స్ కోసమే అని తెలుస్తుంది. సోహెల్ కొత్త మూవీ లక్కీ లక్ష్మణ్ డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇనయాతో పాటు సోహెల్ ఈ వీడియో చేశారనిపిస్తుంది. సదరు లవ్ ప్రపోజల్ వీడియోలో లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అభి ఏఆర్, నిర్మాత హరిత గోగినేని లను చూడవచ్చు.
Bigg boss Inaya Sulthana
లక్కీ లక్ష్మణ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగమే ఈ వీడియో అని ప్రచారం జరుగుతుంది. అలాగే ఇనయా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఈ ఛానల్ లో ఫస్ట్ వీడియోగా సోహెల్ లవ్ ప్రపోజల్ అప్లోడ్ చేసింది ఇనయా. అటు లక్కీ లక్ష్మణ్ ప్రమోషన్స్, ఇటు ఇనయా సుల్తానా యూట్యూబ్ ఛానల్ కి పాపులారిటీ దక్కేలా ప్లాన్ చేసినట్లు ఉన్నారు.
Bigg boss Inaya Sulthana
బిగ్ బాస్ సీజన్ 4 లో సోహెల్ టాప్ 3 కంటెస్టెంట్ అతడు సూట్ కేసు తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. అయితే ఫేమ్ రాబట్టిన సోహెల్ లక్కీ లక్ష్మణ్ తో పాటు మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇక లేడీ టైగర్ ఇనయా కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.