Ashu Reddy: నెటిజన్ కి చెప్పు చూపించిన అషురెడ్డి... అంత కాలిందంటే ఇంతకీ ఏమన్నాడు!
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి చర్యలు ఎప్పుడూ వివాదాస్పదమే. ఎవరినేమీ అనకపోయినా... బోల్డ్ చర్యలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఒక నెటిజెన్ కి ఆమె చెప్పు చూపించారు.

అషురెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా చేసే ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ఐటెం భామలు, బోల్డ్ హీరోయిన్స్ కి మించి స్కిన్ షో చేస్తుంది. ఒక తెలుగు అమ్మాయి ఆ రేంజ్ లో స్కిన్ షో చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్రమంలో ఆమె ఫోటోలపై పలువురు బూతు కామెంట్స్ పెడుతూ ఉంటారు. రాయలేని భాషలో పదాలు, వాఖ్యలు పోస్ట్ చేశారు.
ఈ విమర్శలను అషురెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య ఓ వీడియో పోస్ట్ చేసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలకు సిగ్గు లజ్జా ఉండవంటూ... ఓ మూవీలో రమాప్రభ చెప్పిన డైలాగ్ తో డబ్స్మాష్ వీడియో చేసి ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. బూతు నా బట్టలో కాదు మీ చూపులో ఉందని ఇండైరెక్ట్ గా సెటైర్ వేసింది.
Ashu Reddy
తాజాగా ఓ నెటిజన్ కి చెప్పు చూపించి ఆమె వార్తలకెక్కారు. తన అభిమానులతో ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న అషురెడ్డిని ఓ నెటిజన్ కోపం తెప్పించే ప్రశ్న అడిగారు. ఈ మధ్య నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అది నీకు అర్థం కావడం లేదా? అని ఘాటైన సెటైర్ వేశాడు. సదరు సెటైర్ కి కౌంటర్ గా... అవును ఈ మధ్య పెరగడం కాదు తగ్గింది, అంటూ చెప్పు ఎమోజీ పోస్ట్ చేసింది.
దాంతో ఆమె నెటిజన్ కి చెప్పు చూపించినట్లు అయ్యింది. అషురెడ్డి చర్యకు ఏం చేయాలో కూడా అర్థం కాక సదరు నెటిజన్ గమ్మునుండి పోయాడు. అషురెడ్డి సమాజాన్ని పెద్దగా పట్టించుకోదు. నచ్చినట్లు బ్రతికేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తుంది. వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
కాగా బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. ఆమెకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ వస్తున్నట్లున్నాయి. నటిగా సెటిల్ కావాలనే ప్రయత్నాల్లో ఉంది. హాట్ ఫోటో షూట్స్ అందులో భాగమే.
సోషల్ మీడియా సెలబ్రెటీగా అషురెడ్డి పాపులారిటీ తెచ్చుకున్నారు. జూనియర్ సమంత అనే ఫేమ్ తెచ్చుకుంది. దాంతో ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గోనే ఛాన్స్ దక్కించుకుంది. సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి అంతగా అలరించలేదు. గతంతో పోల్చితే మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.
ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎఫైర్ నడుపుతున్నారనే టాక్ ఉంది. పలుమార్లు వీరిద్దరూ సన్నిహితంగా కనిపించారు. తరచుగా కలిసే ఈ జంట ప్రేమించుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. రాహుల్ పాడిన పాట నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అందుకోవడంతో అషురెడ్డి కంగ్రాట్స్ చెబుతూ... రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది.